News October 2, 2024
NLG: సర్వేకు వెంటనే బృందాలను ఏర్పాటు చేయాలి: జిల్లా కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్న కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు సర్వేకు జిల్లాలో వెంటనే బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్‌లతో కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు ఏర్పాటు అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News October 11, 2024
నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి
ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకే తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపడుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గంధంవారిగూడెం వద్ద రూ.300 కోట్లతో నిర్మిస్తున్న రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజను నిర్వహించారు. ఇంగ్లిష్, తెలుగు మీడియలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
News October 11, 2024
NLG: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి
ఉమ్మడి నల్గొండలో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా మేనిఫెస్టో విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపురంలో కొడారి లతమల్లేశ్ ముందస్తు సర్పంచ్ ఎలక్షన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. గ్రామస్థులకు ఉచిత మంచినీటిని, ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.
News October 11, 2024
నల్గొండ: తెల్లబోతున్న పత్తి రైతులు..!
పత్తికి సరైన ధర దక్కక రైతులు దిగులు చెందుతున్నారు. ఏటా పెట్టుబడి బారం, సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో సరిగా వర్షాలు పడక.. కాలం కలిసి రాక దిగుబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. వచ్చిన ఆ కొద్ది పాటి పంటను తీసుకుందామంటే వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తి తడిచి చేనులోనే మొలకలు వస్తు న్నాయి. క్వింట పత్తి మొదట రూ.7000 -8000 ఉండగా.. ప్రస్తుతం రూ.5000-6000 కే పరిమితం అయింది.