News November 17, 2024
NLG: సాగు అంచనా @5,83,620 ఎకరాలు!

జిల్లాలో రైతన్నలు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 5,83,620 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. అందులో వరి 5,56,920 ఎకరాలు, సజ్జ 150, జొన్న 2,200, వేరుశనగ 21,000, పెసర 2,000, ఆముదం 350, మినుములు 1,000 ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ భావిస్తోంది.
Similar News
News September 18, 2025
ఎంజీయూలో వివిధ విభాగాలకు నూతన అధిపతుల నియామకం

మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని వివిధ విభాగాలకు నూతన అధిపతులను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. రసాయన శాస్త్ర విభాగానికి డా. ఎం.జ్యోతి, గణిత శాస్త్ర విభాగానికి డా. జి.ఉపేందర్‌రెడ్డి, భౌతిక శాస్త్ర విభాగానికి డా. శాంత కుమారి, రసాయన శాస్త్ర విభాగం బీఓఎస్ (బోర్డ్ ఆఫ్ స్టడీస్)గా డా. ఆర్.రూప నియమితులయ్యారు. వీరు రెండేళ్ల పాటు ఆయా విభాగాలకు అధిపతులుగా వ్యవహరిస్తారు.
News September 18, 2025
ఫలితాలను పెంచడంపై దృష్టి సారించాలి: కలెక్టర్

కెజిబివి, ఇంటర్మీడియట్ కళాశాలలో ఫలితాలను పెంచడంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయా పాఠశాలలు, ఇంటర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. బుధవారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కేజీబివిలు, ఇంటర్ కళాశాలల్లో ప్రవేశాలు, అప్లిఏషన్, ఫలితాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. గడిచిన 3 సంవత్సరాలలో ప్రవేశాలు తక్కువగా ఉన్నాయని అన్నారు.
News September 17, 2025
స్వాతంత్య్ర పోరాటంతో RSSకు సంబంధం లేదు: బృందాకారత్

భారత స్వాతంత్ర్య పోరాటంతో బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ స్పష్టం చేశారు. నల్గొండలో జరుగుతున్న వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.