News November 17, 2024

NLG: సాగు అంచనా @5,83,620 ఎకరాలు!

image

జిల్లాలో రైతన్నలు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 5,83,620 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. అందులో వరి 5,56,920 ఎకరాలు, సజ్జ 150, జొన్న 2,200, వేరుశనగ 21,000, పెసర 2,000, ఆముదం 350, మినుములు 1,000 ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ భావిస్తోంది.

Similar News

News December 11, 2024

రాజగోపాల్ రెడ్డి మౌనానికి అర్థం ఏమిటి..?

image

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మౌనానికి అర్థం ఏమిటనే సర్వత్రా చర్చ సాగుతుంది. వలిగొండలో సీఎం చేపట్టిన మూసీ ప్రక్షాళన యాత్రలో ఆయన కనిపించలేదు.  నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న విజయోత్సవ సభకు సైతం డుమ్మా కొట్టారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి.. అది నేటికి కార్యరూపం దాల్చకపోవడంతో ఆయన సైలెంట్‌గా ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

News December 11, 2024

వేగుచుక్క.. నాగార్జునసాగర్

image

కరవుకాటకాలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు వేగుచుక్కలా నిలిచింది నాగార్జునసాగర్ ప్రాజెక్టు. 1955 డిసెంబరు 10న నాటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. NLG జిల్లా నందికొండ వద్ద కృష్ణ నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మానవ నిర్మిత ప్రాజెక్టుగా సాగర్ ప్రసిద్ధి చెందడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం.

News December 11, 2024

మంత్రి పదవిపై ఐలయ్య రెస్పాన్స్

image

ఐలయ్యకు మంత్రి పదవి అని వస్తున్న కథనాలపై ఆయన స్పందించారు. బీసీ కోటాలో పరిగణనలోకి తీసుకొని తనకు మంత్రి పదవి ఇస్తారనని భావిస్తున్నట్లు MLA ఐలయ్య చెప్పారు. అయితే తాను కాంగ్రెస్​కు విధేయుడనని, పార్టీ చెప్పింది చేయడమే తన పని అని చెప్పారు. తనకు ఇప్పటికే క్యాబినెట్ ​ర్యాంక్​ కలిగిన ప్రభుత్వ విప్ ఇచ్చారని, మంత్రి పదవి ఇచ్చినా.. ఇవ్వకున్నా బాధేమీ ఉండదని చెప్పారు.