News March 23, 2025
NLG: సైనిక దళంలో ఉద్యోగాలకు దరఖాస్తులు

భారత సైనిక దళంలో ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ పథకం కింద జనరల్, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్ టెక్ని కల్, ట్రేడ్స్ మెన్‌గా చేరవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల పురుష అభ్యర్థులు పూర్తి వివరాలను www.joi nindianarmy.nic.in వెబ్ సైట్‌లో చూసుకోవచ్చని ఆమె తెలిపారు.
Similar News
News December 3, 2025
NLG: నేటి నుంచి మూడో విడత నామినేషన్లు

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. రెండో విడత MLG డివిజన్లో నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. మూడో విడత దేవరకొండ డివిజన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 3న ఎన్నికల అధికారి విడుదల చేయనున్నారు. దేవరకొండ డివిజన్లోని 9 మండలాల్లో 269 గ్రామాలకు, 2,206 వార్డులకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
News December 2, 2025
నియామక పత్రం అందుకున్న పున్న కైలాష్ నేత

నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య, టీపీసీసీ జనరల్ సెక్రటరీలు చనగాని దయాకర్, దైద రవీందర్ పాల్గొన్నారు.
News December 2, 2025
నల్గొండ: ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్‌కు నోచుకోని గ్రామాలు!

నల్గొండ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో స్థానిక సర్పంచ్ ఎన్నికలకు ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్నా రిజర్వేషన్ రాలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నార్కెట్‌పల్లి, నిడమనూర్, గుండ్రంపల్లి, వెలిమనేడు, పెద్ద కాపార్తి, పెద్దదేవులపల్లి, ముత్యాలమ్మ గూడెం, చందంపేట, పులిచెర్ల, దాచారం , అంగడిపేట, వీర్లపాలెం, పగిడిమర్రి, కొండూరు, ఎర్రగండ్లపల్లి ఇలా దాదాపు 27 పంచాయతీలకు ఒక్కసారి కూడా సర్పంచ్ SC రిజర్వ్ కాలేదు.


