News January 5, 2025

NLG: స్థానిక పోరుకు సన్నద్ధం…

image

NLG జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా గ్రామపంచాయతీ ఎన్నికలా? ప్రాదేశిక ఎన్నికలా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల సామగ్రిని జిల్లాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఏ ఎన్నికలు ముందుగా వస్తాయనే విషయంపై గ్రామాల్లో చర్చ జోరుగా జరుగుతోంది.

Similar News

News February 27, 2026

అమర పోలీసుల కుటుంబాలకు ఎస్పీ భరోసా

image

విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది షేక్ తాయూబ్, మరియదాస్‌ల కుటుంబాలకు ఎస్పీ చేయూతనిచ్చారు. మృతుల కుటుంబ సభ్యులు సభానా, లక్ష్మిలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. వారి త్యాగం శాఖకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని, విధి పట్ల వారు చూపిన నిబద్ధత వెలకట్టలేనిదని ఎస్పీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

News February 27, 2026

పుణ్యక్షేత్రాల దర్శనానికి ‘భారత్ గౌరవ్’ రైళ్లు

image

పుణ్యక్షేత్రాల దర్శనానికి ఐఆర్‌సీటీసీ ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. మార్చి 21 నుంచి జూన్ 12 వరకు తెలుగు రాష్ట్రాల నుంచి 6 ప్రత్యేక ప్యాకేజీలు నిర్వహించనున్నట్లు ఐఆర్‌సీటీసీ మేనేజర్ పి.వి. వెంకటేష్ తెలిపారు. రామేశ్వరం, కన్యాకుమారి యాత్రకు ₹14,700, ఉజ్జయిని, సోమనాథ్ యాత్రకు ₹17,600 టికెట్ ధరలు నిర్ణయించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News February 27, 2026

జిల్లా ఆసుపత్రిలో పడిపోతున్న రక్త నిలువలు

image

జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని బ్లడ్‌ బ్యాంకులో రక్త నిలువలు అడుగంటిపోతుండటం కలకలం రేపుతోంది. 400 యూనిట్ల సామర్థ్యం ఉన్న బ్యాంకులో ప్రస్తుతం కేవలం 66 ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రోగుల అవసరాల దృష్ట్యా ఒకరికి రక్తం ఇచ్చేందుకు ఇద్దరు దాతలను కోరుతున్నా.. కొరత తీరడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో రోగులకు ప్రాణాపాయం తప్పదని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.