News April 16, 2025

NLG: హత్యాయత్నం కేసులో ఒకరికి జైలు శిక్ష

image

గిరిజన మహిళపై హత్యాయత్నం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ NLG SC, ST కోర్టు జడ్జి రోజారమణి బుధవారం తీర్పునిచ్చారు. 2018 అక్టోబర్ 13న రాత్రి నాంపల్లిలోని దామెరకు చెందిన ఓ మహిళను అదే గ్రామానికి చెందిన మహేశ్ పత్తి చేలోకి తీసుకెళ్లి ఆమెపై యాసిడ్ పోసి హత్యాయత్నం చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి జైలు శిక్ష విధించారు.

Similar News

News April 20, 2025

రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన

image

జిల్లాలో రాజీవ్ వికాసం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుంది. ఈ పథకానికి జిల్లా వ్యాప్తంగా 79,052 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే ఈ దరఖాస్తులను మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు పరిశీలిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు 21,120, ఎస్టీ కార్పొరేషన్‌కు 11,515, బీసీ కార్పొరేషన్‌కు 39,274, ఈ బీసీ 1,994, మైనార్టీకి 4,926, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్‌కు 253 దరఖాస్తులు వచ్చాయి.

News April 20, 2025

ఒకే కాన్పులో ముగ్గురు జననం

image

సూర్యాపేట మండల పరిధిలోని రాయినిగూడెంకి చెందిన షేక్ షబానాకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో సంతానం కోసం చికిత్స పొంది గర్భం దాల్చారు. ఆమెకు బీపీ, షుగర్, థైరాయిడ్ ఉండటంతో ఆసుపత్రి యజమాన్యం హైరిస్క్ ప్రెగ్నెన్సీగా అడ్మిట్ చేసుకొని సిజేరియన్ చేశారు. ఒకే కాన్పులో ఇద్దరు మగ శిశువులు, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చారు.

News April 20, 2025

NLG: ప్రతి మూడో ఆదివారం.. బుద్ధవనం టూర్!

image

టూరిజం శాఖ సహకారంతో ప్రతిమ ట్రావెల్స్ ఆధ్వర్యంలో HYD నుంచి నాగార్జునసాగర్‌కు ప్రతి నెలా మూడో ఆదివారం ప్రత్యేకంగా పర్యాటకులకు నాగార్జునసాగర్ టూర్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు బుద్ధవనం నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు HYD నుంచి బయల్దేరి నాగార్జునసాగర్ చేరుకొని బుద్ధవనం, నాగార్జునకొండలను సందర్శించిన అనంతరం రాత్రి 9 గంటల వరకు HYDకు పర్యాటకులను చేర్చుతారని తెలిపారు

error: Content is protected !!