News June 14, 2024
NLG: హైవే అంటే భయపడుతున్న వాహనదారులు

హైదరాబాద్ – విజయవాడ హైవేపై దారి దోపిడీలు, హత్యలు, దొంగతనాల సంఖ్య పెరుగుతోంది. రెండు నెలల కాలంలో పలు దోపిడీలు, దొంగతనాలు జరగడంతో రాత్రిపూట ఈ దారిలో ప్రయాణించే వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. చౌటుప్పల్లో గతంలో ఇలాంటి ఘటనలు రెండు చోటు చేసుకున్నాయి. తాజాగా ఏపీ లింగోటం వద్ద లారీని ఆపి డ్రైవర్ ను తాళ్లతో కట్టి నగదు చోరీ చేశారు. గత నెల 18న ఎరసానిగూడెం వద్ద లారీ డ్రైవర్ హత్యకు గురయ్యాడు.
Similar News
News November 22, 2025
BREAKING: నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పున్న కైలాష్

డీసీసీ అధ్యక్షులను ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అదిష్ఠానం ప్రకటించింది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పున్న కైలాష్ నేతను నియమించింది. నల్గొండ డీసీసీకి పలువురు పోటీ పడినప్పటికీ మునుగోడుకు చెందిన పున్న కైలాష్ నేతనే డీసీసీ పదవి వరించింది.
News November 22, 2025
NLG: వాట్సప్తో ఇక మీ సేవలు..!

నల్గొండ జిల్లా ప్రజలకు అతి ముఖ్యమైన మీ-సేవ సేవలు మరింత సులభతరమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీలో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. జిల్లాలో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా అన్ని రకాల అవసరాల కోసం వివిధ సర్టిఫికెట్స్ పొందడానికి ఇక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా మీ సేవలను వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తోంది. ఇటీవల మంత్రి శ్రీధర్ బాబు కొత్త డిజిటల్ సేవలను ప్రారంభించారు.
News November 22, 2025
NLG: తూతూ మంత్రంగా యువజన ఉత్సవాలు

యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతియేటా యువజన ఉత్సవాలను నిర్వహిస్తోంది. నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా మంచి అవకాశాలకు యువత దూరం అవుతున్నది. యువజన ఉత్సవాలపై ముందుగానే జిల్లాలోని అన్ని ప్రాంతాల యువతకు సమాచారం చేయవలసిన బాధ్యత యువజన క్రీడలశాఖపై ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సమాచారం తమకు అందలేదని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


