News June 14, 2024
NLG: హైవే అంటే భయపడుతున్న వాహనదారులు
హైదరాబాద్ – విజయవాడ హైవేపై దారి దోపిడీలు, హత్యలు, దొంగతనాల సంఖ్య పెరుగుతోంది. రెండు నెలల కాలంలో పలు దోపిడీలు, దొంగతనాలు జరగడంతో రాత్రిపూట ఈ దారిలో ప్రయాణించే వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. చౌటుప్పల్లో గతంలో ఇలాంటి ఘటనలు రెండు చోటు చేసుకున్నాయి. తాజాగా ఏపీ లింగోటం వద్ద లారీని ఆపి డ్రైవర్ ను తాళ్లతో కట్టి నగదు చోరీ చేశారు. గత నెల 18న ఎరసానిగూడెం వద్ద లారీ డ్రైవర్ హత్యకు గురయ్యాడు.
Similar News
News September 10, 2024
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆప్డేట్
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు 12 గేట్లను ఎత్తి 95,490 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1,38,473 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,38,473 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589 అడుగులుగా ఉంది.
News September 10, 2024
RRR భూ సేకరణకు మరో ముందడుగు..!
RRR భూ సేకరణకు మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు జాతీయ రహదారుల విభాగం వారు కోరినంత స్థలాన్ని అప్పగించేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం నడుం బిగించింది. జిల్లాకు సంబంధించి తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాలకు అదనపు కలెక్టర్, భువనగిరి, చౌటుప్పల్ రెవిన్యూ డివిజన్లకు ఆయా డివిజన్ల ఆర్డీవోలను అధీకృత భూసేకరణ అధికారులుగా నియమించారు.
News September 10, 2024
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్
NLG: ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు ప్రజావాణిపై కలెక్టర్ సూచనలు చేస్తూ ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని, ఫిర్యాదులు పెండింగ్లో ఉంచవద్దని అన్నారు.