News April 4, 2026
NLG: అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరత

నల్గొండ జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. నల్గొండ, దేవరకొండలో ఎస్ఎఫ్‌ఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డీఓ/ఎస్ఎఫ్ఓ ఖాళీలు నల్గొండలో 1, నకిరేకల్‌లో 2, హాలియాలో 1 ఉన్నాయి. ఫైర్‌మెన్ (ఎఫ్‌ఎం) పోస్టులు దేవరకొండ, నకిరేకల్‌లో 4 చొప్పున, మిర్యాలగూడలో 3, హాలియాలో 2 ఖాళీగా ఉన్నాయి. వేసవిలో అగ్నిప్రమాదాలు పెరిగే ముప్పు ఉన్నందున వెంటనే ఈ ఖాళీలను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News April 5, 2026
NLG: ఫ్రిడ్జ్ పేలకూడదంటే.. ఈ జాగ్రత్తలు మరువొద్దు

వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల రిఫ్రిజిరేటర్లు పేలుతున్న <<19570386>>ఘటన<<>>లు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిని నివారించాలంటే ఫ్రిడ్జ్‌ను గోడకు ఆనించకుండా గాలి ఆడేలా కనీసం అడుగు దూరం ఉంచాలి. దీనివల్ల కంప్రెసర్ వేడి బయటకు పోతుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుంచి రక్షణకు నాణ్యమైన స్టెబిలైజర్ వాడాలి. ఫ్రిడ్జ్‌లో పరిమితికి మించి వస్తువులను కుక్కకూడదు. ఇబ్బందులుంటే మెకానిక్‌తో తనిఖీ చేయిస్తే ప్రమాదాలను నివారించవచ్చు.
News April 5, 2026
NLG: ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (DRDO) వై.శేఖర్‌రెడ్డి ఆదేశించారు. నల్గొండలో నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 161 కొనుగోలు కేంద్రాలను మంజూరు చేసినట్లు తెలిపారు. కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పీపీసీ నిర్వాహకులకు, మహిళా సమాఖ్య ప్రతినిధులకు సూచించారు.