News December 26, 2024
NLG: అటు ముసురు.. ఇటు చలి తీవ్రత
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా బుధవారం నల్గొండ జిల్లా వ్యాప్తంగా ముసురు పట్టింది. మంగళవారం రాత్రి నుంచే చిరుజల్లులతో ముసురుకుంది. ఒకవైపు ముసురు.. మరో వైపు చలి తీవ్రతతో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. క్రిస్మస్ కావడంతో పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై జన సందడిగా మోస్తరుగా కనిపించింది. చలి తీవ్రత కారణంగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
Similar News
News December 26, 2024
ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి మాతృ వియోగం
వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి మాతృ వియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి అలుగుబెల్లి భాగ్యమ్మ ఉదయం 5గం.లకు అనారోగ్యంతో కన్ను మూశారు. ఆమె మృతి పట్ల టీఎస్ యుటీఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమయ్య, అనీల్, జిల్లాలోని మండల శాఖల పక్షాన సంతాపం ప్రకటించారు.
News December 26, 2024
NLG: మళ్లీ పడగ విప్పుతున్న ఫ్లోరైడ్ భూతం
NLG జిల్లాలో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ పెరుగుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా మర్రిగూడ మండలంలో నిర్వహిస్తున్న సర్వేలో ఫ్లోరోసిస్ లక్షణాలు బయటపడ్డాయి. ఈ మండలంలో 20 గ్రామపంచాయతీలో 39,700 మందిపై సర్వే నిర్వహిస్తున్నారు. బుధవారం వరకు 880 కుటుంబాలు 4 వేలకు పైగా ప్రజలపై ఈ ఫ్లోరోసిస్ సర్వేను వైద్య సిబ్బంది పూర్తి చేశారు. శివన్నగూడ, బట్లపల్లి గ్రామాల్లో అధికంగా ఫ్లోరైడ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
News December 26, 2024
NLG: సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..?
జీపీ ఎన్నికలు త్వరలోనే జరిగే అవకాశం ఉంది. అందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 1770 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 856, సూర్యాపేట జిల్లాలో 486, యాదాద్రి భువనగిరి జిల్లాలో 428 జీపీలు ఉన్నాయి. ఎప్పటిలాగే ఈసారి ఎన్నికల పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువ జీపీలు ఏ పార్టీ మద్దతుదారులు గెలుస్తారని అనుకుంటున్నారు. కామెంట్ చేయండి.