News October 27, 2025

NLG: అదృష్టవంతులు ఎవరో..!

image

నల్గొండ జిల్లాలో వైన్స్ టెండరుదారుల భవితవ్యం మరికాసేపట్లో తేలనుంది. ఎంతో మంది ఆశావహులు వైన్స్ టెండర్లు దక్కించుకోవాలని ఆశతో ఉన్నప్పటికీ వారి కల నెరవేరుతుందో లేదో అని టెన్షన్ పడుతున్నారు. ఈసారి జిల్లాలో 154 దుకాణాలు ఉండగా.. 4,906 దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తు ఫీజును పెంచడంతో కొందరు గ్రూపులు జతకట్టి దరఖాస్తు చేసుకున్నారు.

Similar News

News October 27, 2025

NLG: జిల్లాలో మొంథా అలజడి

image

జిల్లాలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మొంథా తుపాను ముంచుకొస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలు, ఈదురు గాలులు కారణంగా వందల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. శాలిగౌరారం మండలంలో ఏకంగా రోడ్డు తెలిపోయింది.

News October 27, 2025

NLG: ఆగ మేఘాలతో ఆధార్ అనుసంధానం..!

image

జిల్లాలో ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణకు దిగింది. ఔట్‌సోర్సింగ్ ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగుల వివరాలను ఆధార్ అనుసంధానిస్తున్నారు. దీని ద్వారా క్షేత్రస్థాయిలో పనిచేయకుండానే.. రికార్డుల్లో చూపే వారికి అందే వేతనాలు నిలిచిపోనున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు రెండువేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.

News October 27, 2025

NLG: నకిలీ స్వీట్ల దందా.. తింటే అంతే సంగతి!

image

నల్గొండలో కొందరు వ్యాపారులు కాలం చెల్లిన, పురుగులు పట్టిన ముడి పదార్థాలతో స్వీట్లు తయారు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘిస్తూ కొనుగోలుదారులను ఆకర్షించడానికి హానికరమైన రసాయనాలను కలుపుతున్నట్లు ఇటీవల అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఇటువంటి మిఠాయిలు తినడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.