News April 5, 2025
NLG: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కోదాడలో నల్గొండ మండాలనికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. దోనకల్ గ్రామానికి చెందిన సైదులు(31) బోర్‌వెల్స్‌లో పని చేస్తూ జీవిస్తున్నాడు. పని నిమిత్తం కోదాడకు వెళ్లాడు. ఈ క్రమంలో గురువారం సైదులుకి కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతుడి భార్య నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News April 5, 2025
అణగారిన వర్గాల గొంతుక బాబు జగ్జీవన్ రామ్: మంత్రి కోమటి రెడ్డి

అణగారిన వర్గాల గొంతుక బాబు జగ్జీవన్ రామ్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని నల్గొండ పమర్రి గూడ బైపాస్ వద్ద గల బుద్ధ గార్డెన్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
News April 5, 2025
నాగార్జునసాగర్: కిడ్నాప్.. వ్యక్తి హత్య

నాగార్జునసాగర్‌లోని హిల్స్ కాలనీలో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాలు.. భూమి పంచాయతీ కారణంతో సొంత అల్లుడే అంతమొందించాడు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం పశువేముల గ్రామానికి చెందిన పండ్ల హరిశ్చంద్ర, బెజవాడ బ్రహ్మం మామా అల్లుళ్లు. వీరి మధ్య కొంతకాలంగా భూమి పంచాయతీ నడుస్తోంది. దీంతో అతడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ ఓ ప్రకటనలో తెలిపారు.
News April 4, 2025
NLG: TCC కోర్స్ వేసవి శిక్షణ శిబిరం

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ వేసవి శిక్షణ శిబిరాన్ని మే 1 నుంచి జూన్ 11 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో బొల్లారం బిక్షపతి తెలిపారు. నల్గొండలోని డైట్ ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కర్నాటిక హిందుస్థాని సంగీతం, వుడ్ వర్క్ కోర్సులలో శిక్షణ ఇస్తామన్నారు. అర్హులైన వారు ఏప్రిల్ 17 నుంచి 29 వరకు డీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.