News October 10, 2025

NLG: అన్ని పాఠశాలల్లో ఆడిట్: కలెక్టర్

image

విద్యార్థుల భద్రత దృష్ట్యా త్వరలోనే జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఆడిట్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గత నెల 4న DVK రోడ్‌లో ఉన్న మాస్టర్ మైండ్స్ పాఠశాలలో బస్సు కిందపడి మృతి చెందిన చిన్నారి జశ్విత కేసు విషయం బాధాకరమని కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాలలో చదివే విద్యార్థులకు నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో మానవతా దృక్పథంతో నోటీసులు జారీచేసి పాఠశాలను తాత్కాలికంగా మాత్రమే సీజ్ చేశామన్నారు.

Similar News

News October 10, 2025

NLG: మిగిలింది 8 రోజులే….!

image

మద్యం టెండర్ల ప్రక్రియ ప్రారంభమై 14 రోజులు గడిచిపోయింది. ఇక టెండర్లు వేసేందుకు కేవలం 8 రోజుల గడువే ఉంది. అయితే ఈ నెల 18వ తేదీ గడువులోగా టెండర్లు వేగం చేసేందుకు అధికారులు కూడా వ్యాపారులను మోటివేట్ చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం డిపాజిట్ ధర పెంచడంతో కొందరు వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది కలిసి ఒక టెండర్‌ను వేసే ధోరణిలో ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

News October 10, 2025

NLG: ఎంపీటీసీ స్థానాలకు 2 నామినేషన్లు దాఖలు

image

స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికల్లో భాగంగా నల్గొండ, దేవరకొండ డివిజన్ల పరిధిలోని 18 జడ్పీటీసీ, 196 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసి, అధికారులు నామినేషన్లను స్వీకరించారు. దీంతో కనగల్ మండలం జీ ఎడవల్లి ఎంపీటీసీ స్థానానికి ఒకరు, NKP మండలం NKP-1 ఎంపీటీసీ స్థానానికి మరొకరు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

News October 10, 2025

నేడు నల్గొండ జిల్లా బంద్

image

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు శుక్రవారం నల్గొండ జిల్లా బంద్ నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. బంద్‌కు అన్ని వ్యాపార, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు సహకరించాలని కోరారు.