News November 18, 2025

NLG: అప్పుల బాధతో యువ రైతు SUICIDE

image

మునుగోడుకు చెందిన పిట్టల సురేందర్(30) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. 7 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. కూలీలను తీసుకొచ్చేందుకు EMI పద్ధతిలో రూ.3 లక్షలు పెట్టి ఆటో కూడా కొనుగోలు చేశాడు. అయితే, అధిక వర్షాల కారణంగా పంట నష్టం రావడంతో EMIలు, కౌలు చెల్లించలేక వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News November 18, 2025

బ్రహ్మోత్సవాల్లో రోజుకో చీర.. సీక్రెట్ ఇదే!

image

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా మొదలయ్యాయి. రోజుకో వాహనంపై అమ్మవారు విహరిస్తారు. ఒక్కో రోజు ఒక్కో రకమైన రంగు చీరలతో అమ్మవారిని అలంకరిస్తారు. కెంపు(ఎరుపు వర్ణం), తెలుపు, పగడపు, ఆకు పచ్చ, పసుపు, నీలం, హేమ వర్ణాల చీరలతో దర్శనమిస్తారు. ఈ వర్ణాల వల్ల అనేక శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. మీరు ఎప్పుడైనా వాహన సేవల్లో ఈ రంగురంగల చీరలను గుర్తించారా..?

మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం

image

AP: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతమయ్యాడు. హిడ్మాతో పాటు ఆయన భార్య సహా ఆరుగురు మావోలు మరణించారు. హిడ్మా కోసం పలు రాష్ట్రాల పోలీసులు ఎంతోకాలంగా వెతుకుతున్నారు. ప్రస్తుతం అతడు మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ సెక్రటరీగా ఉన్నాడు.