News December 10, 2024
NLG: అప్రెంటిస్ షిప్‌లో దరఖాస్తుల ఆహ్వానం

బీకాం, బీఎస్సీ కంప్యూటర్, బీటెక్ మెకానిక్, డిప్లొమా మెకానికల్ పూర్తిచేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. వారికి మూడేళ్లపాటు ఆర్టీసీలో అప్రెంటిస్ షిప్ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 20వ తేదీలోగా ఆసక్తి గల అభ్యర్థులు నల్లగొండ రీజనల్ మేనేజర్ కార్యాలయంతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల్లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు.
Similar News
News February 19, 2026
NLG: బాధితుడికి అండగా నిలిచిన కలెక్టర్

నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ తన ఉదారతను చాటుకున్నారు. కొండమల్లేపల్లి పర్యటన నుంచి తిరిగి వస్తుండగా ధర్వేశిపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించిన ఆయన, వెంటనే తన వాహనాన్ని ఆపి క్షతగాత్రుడైన పరశురామ్‌ను పరామర్శించారు. స్వయంగా అంబులెన్స్‌కు సమాచారం అందించి, బాధితుడిని ఆసుపత్రికి పంపే వరకు అక్కడే ఉండి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కలెక్టర్ సమయస్ఫూర్తిని స్థానికులు కొనియాడుతున్నారు.
News February 19, 2026
NLG: నిరుద్యోగులకు ‘న్యాక్’ (NAC) ఉచిత శిక్షణ, ఉపాధి

నల్గొండ జిల్లా నిరుద్యోగ యువతకు జాతీయ నిర్మాణ అకాడమీ (NAC) ఉచిత శిక్షణతో పాటు 100% ఉపాధి కల్పించనుంది. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎలక్ట్రీషియన్, సూర్యమిత్ర సోలార్ పీవీ ఇన్‌స్టాలర్ కోర్సులకు ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలి. 90 రోజుల శిక్షణలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తారు. ఆసక్తి గల వారు నల్గొండ ఐటీఐలోని NAC కార్యాలయంలో లేదా 7893332674, 8297431655 నంబర్లలో సంప్రదించవచ్చు.
News February 19, 2026
నల్గొండ: పంట సర్వేకు వాలంటీర్ల నియామకం

నల్గొండ జిల్లాలో యాసంగి పంటల నమోదుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ డిజిటల్ సర్వే కోసం గ్రామానికి ఒక వాలంటీర్‌ను నియమించనున్నారు. అగ్రికల్చర్ డిగ్రీ, డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి సర్వే నమోదుకు రూ.7 చొప్పున చెల్లిస్తారు. 2 రోజుల్లో లోపు నియామకాలు పూర్తి చేసి, నెల చివరిలోగా సర్వే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలో 5.66 లక్షల ఎకరాల పంట వివరాలు సేకరించనున్నారు.


