News October 6, 2025
NLG: అభ్యర్థుల కోసం అన్వేషణ.. పార్టీల వ్యూహాలు

నల్గొండ జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మెజారిటీ సాధించేందుకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో 33 జెడ్పీటీసీ, 353 ఎంపీటీసీ, 33 ఎంపీపీ స్థానాల నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల పేర్లను సేకరించే పనిలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. ఎన్నికల కోసం ఆశావహులు ఉత్సాహం చూపుతున్నారు.
Similar News
News October 6, 2025
NGKL: అండర్-19.. 8న కబడ్డీ ఎంపికలు

ఉమ్మడి మహబూబ్ నగర్ ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 8న బాల, బాలికల U/19 కబడ్డీ ఎంపికలు ఉంటాయని నాగర్ కర్నూల్ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ Way2Newsతో తెలిపారు. MBNRలోని స్టేడియంలో ఉ. 9:00 గం. ఎంపికలు ఉంటాయని, 1-1-2007 తర్వాత జన్మించిన వారు అర్హులని, బాలురు 70 కేజీలు, బాలికలు,65 కేజీల బరువు కలిగి ఉండాలని, ఆసక్తి గల క్రీడాకారులు ఒరిజినల్ ఎస్ఎస్సి మెమో, బోనఫైడ్, ఆధార్ తీసుకొని రావాలన్నారు.
News October 6, 2025
కార్వేటినగరంలో జోరుగా బెల్ట్ షాపులు.?

కార్వేటినగరం, వెదురుకుప్పం, పాలసముద్రం మండలాల్లో యథేచ్ఛగా బెల్ట్ షాపులు నడుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఉ.5 గంటల నుంచి రా.11 వరకు బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయట. మత్తులో విచ్చలవిడిగా వాహనాలు నడపడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారట. ఇంతా జరుగుతున్నా అధికారులు, పాలకులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారట. మరి మీ ఏరియాలో బెల్ట్ షాపులు ఉన్నాయా.? ఉంటే వాటి నిర్వాహణ ఎలా ఉందో కామెంట్ చేయండి.
News October 6, 2025
MDK: ‘పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి’

స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, శాంతి భద్రతలతో సజావుగా జరిగేలా ప్రతి పోలీస్ అధికారి కృషి చేయాలని మెదక్ ఎస్పీ డివి శ్రీనివాసరావు సూచించారు. మెదక్‌లో ఎన్నికల నియమాలపై అధికారులకు అవగాహన శిక్షణ ఏర్పాటు చేశారు. ప్రతి అధికారి గ్రామాలను సందర్శించి పరిస్థితులను అవగాహన చేసుకోవాలని, ఎలాంటి ఘర్షణలకు తావు ఇవ్వకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి శిక్షణ అందజేశారు.