News March 21, 2024
NLG: అష్టకష్టాలు పడుతున్న పండ్లతోటల రైతులు

బోర్లలో నీరు అడుగంటడంతో ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పండ్ల తోటలను రక్షించుకోవడానికి రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి జిల్లాలోనే బత్తాయి సుమారు 60 వేల ఎకరాల్లో, నిమ్మ 20 వేల ఎకరాల్లో ఉన్నాయి. రూ. లక్షలు ఖర్చు చేసి కొత్తగా బోర్లు వేసినా చుక్క నీరు పడటం లేదని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. చాలా ప్రాంతాల్లో తోటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
Similar News
News October 24, 2025
నేరాల అదుపునకు ప్రత్యేక దృష్టి: నల్గొండ ఎస్పీ

నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా పనిచేయాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించాలని, పోక్సో సహా కీలక కేసుల్లో విచారణ వేగవంతం చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని, సైబర్ నేరాలు, అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెంచాలని ఆదేశించారు.
News October 23, 2025
నల్గొండ: తండ్రి మందలించాడని సూసైడ్

చిట్యాల మండలం చిన్నకాపర్తికి చెందిన యువకుడు రుద్రారపు చందు (25) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చందు ట్రాక్టర్ మెకానిక్. ప్రతిరోజు చిట్యాలకు వెళ్లి ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడు. దీంతో తండ్రి మందలించగా మనస్తాపానికి గురై పురుగు మందు తాగాడు. పెద్దకాపర్తి సబ్ స్టేషన్ వద్ద పడి ఉండగా ఆసుపత్రిలో చేర్పించగా గురువారం మృతి చెందాడు.
News October 23, 2025
MLG: 500 ఓటర్లున్నా జనాబాలో జీరో చూపిస్తోంది: స్థానికులు

జంకుతండ గ్రామ పంచాయతీలో 200కు పైగా ఎస్సీ కుటుంబాలు, 500కు పైగా ఓటర్లు ఉన్నప్పటికీ ఒక్క వార్డు సభ్యుడి స్థానం కూడా కేటాయించలేదని స్థానికులు తెలిపారు. 2011 జనాభా లెక్కల్లో ఎస్సీ జనాభాను ‘జీరో’గా చూపించారు. ఈ మేరకు ఎస్సీ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, నాగరాజు, భరత్, సోమయ్య పాల్గొన్నారు.