News January 24, 2026
NLG: ‘అహల్య’ వాగు కాదు నది!

‘అహల్య’ అనగానే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీలోని కామెడీ గుర్తోస్తుంది. కానీ నల్గొండ జిల్లాలో ‘అహల్య’ నది ఫేమస్. కానీ ఇది నేటి తరానికి తెలియదు. ఆ నది పేరు మీదుగానే ఆ గ్రామానికి పేరొచ్చింది.. అదే హాలియా. చరిత్ర క్రమంలో నది పూడిపోయి, ఆక్రమణకు గురికావడం వల్ల ప్రస్తుతం అహల్య వాగుగా మారింది. ఈ వాగు ఒడ్డునే హాలియా పట్టణం విస్తరించి ఉంది. చుట్టుపక్కల వ్యవసాయానికి ఈ వాగు ప్రధాన నీటి వనరు.
Similar News
News February 9, 2026
ఎన్నికలకు సిద్ధం.. సిబ్బంది ఖరారు: కలెక్టర్

జిల్లాలో ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సిబ్బంది కేటాయింపు ప్రక్రియలో కీలకమైన చివరి విడత ర్యాండమైజేషన్ సోమవారం కలెక్టరేట్‌లో పూర్తయింది. ఎన్నికల సాధారణ పరిశీలకులు రమేష్ సమక్షంలో కలెక్టర్ చంద్రశేఖర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. NLG కార్పొరేషన్ సహా MLG, నందికొండ, హలియా, DVK, చండూరు, చిట్యాల పురపాలక సంఘాల్లో 475 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
News February 9, 2026
మర్రిగూడ: అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

మర్రిగూడ మండలం సరంపేటలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అంగన్వాడీలోని విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు మెను ప్రకారం పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ టీచర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్, సర్పంచ్ నక్క రాములమ్మ, కార్యదర్శి రాకేష్, సిడిపిఓ సక్కుబాయి పాల్గొన్నారు.
News February 9, 2026
NLG: ఎంఈఓలూ.. ఏమిటి నిర్లక్ష్యం!?

జిల్లాలో ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడంలో జిల్లా విద్యాశాఖ విఫలమైంది. మొత్తం 3,122 దరఖాస్తుల్లో 2,320 మాత్రమే ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయగా, మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయి. చింతపల్లి, చందంపేట, తిప్పర్తి, పెద్దవూర, DVK, CTL, గట్టుప్పల్, NKL తదితర మండలాల్లో రిజిస్ట్రేషన్ శాతం 55.5 నుంచి 88.2 మధ్యలోనే ఉన్నాయి. దీనిపై కలెక్టర్ ఎంఈఓలకు షోకాజ్ నోటీసులు అందజేశారు.


