News July 10, 2024

NLG: ఆకతాయిలకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్

image

మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే స్పందిస్తూ పోలీస్ శాఖ వారికి రక్షణ కల్పిస్తుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్, షీటీమ్ పోలీస్ స్టేషన్, భరోసా సెంటర్లను ఎస్పీ మంగళవారం పరిశీలించారు. ఆకతాయిలు మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ సందర్భంగా ఎస్సీ హెచ్చరించారు.

Similar News

News October 1, 2024

ఆ బాధ్యత అధికారులపై ఉంది : కలెక్టర్

image

గ్రామాలలో ప్రజలకు రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం, ప్రభుత్వ సంస్థల నిర్వహణపై చేయాల్సిన బాధ్యత జిల్లా స్థాయి మొదలుకొని, గ్రామ స్థాయి అధికారుల వరకు ఉందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

News September 30, 2024

నల్గొండ: ఏసీబీకి చిక్కిన పశు వైద్యాధికారి

image

చింతపల్లి మండల పశు వైద్యాధికారి జోసఫ్ పాల్ రూ.6,000 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గేదెల బ్యాంకు లోన్, హెల్త్ సర్టిఫికెట్ కోసం నసర్లపల్లికి చెందిన ఓ రైతు వద్ద రూ.8వేలు డిమాండ్ చేసి రూ.6 వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064 నంబర్ కి ఫోన్ చేయాలని ఉమ్మడి ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపారు.

News September 30, 2024

NLG: కాసేపట్లో రిజల్ట్స్.. పోటీ ఇలా..

image

DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
NLG 3187 373 1:08
SRPT 2981 213 1:13
యాదాద్రి 742 135 1:05