News October 8, 2024

NLG: ఆర్టిఐ సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

image

RTI ఆవిర్భావ దినోత్సవం సదస్సు కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్రలు ఆవిష్కరించారు. సోమవారం నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరపత్రం ఆవిష్కరించించి సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డా.బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో దుశ్యర్ల సత్యనారాయణ, సైదులు, మేఖల శ్రీహరి, కాడబోయిన సాయి, మల్లయ్య, శంకర్, రాంబాబు పాల్గొన్నారు.

Similar News

News October 7, 2024

NLG: విషాదం.. కొడుకుకి ఉరేసి తల్లి సూసైడ్.!

image

యాదాద్రి జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఓ తల్లి కన్న కొడుకుకి ఉరేసి తాను బలవన్మరణానికి పాల్పడిన ఘటన భూదాన్ పోచంపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దరావులపల్లికి చెందిన జడల సోనీ కొడుకు రియాన్ష్‌కు ఇంట్లో ఉరేసి తాను సూసైడ్ చేసుకుంది. మానసిక గుబులుతో ఆమె ఈఘటనకు పాల్పడినట్లు కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

News October 7, 2024

NLG: పాతబస్తీలో మిషన్ పరివర్తన్ కార్యక్రమం

image

నల్గొండ పట్టణంలోని పాతబస్తీ చౌరస్తాలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గంజాయి, మాదకద్రవ్యాలపై పోలీస్ కళాజాత బృందం వారు అవగాహన కల్పించారు. గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిఐ రాజశేఖర్ రెడ్డి కోరారు. గంజాయి తాగినా, గంజాయి అమ్మినా సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు జూకురి సైదులు, ఉప్పు సురేష్ తదితరులు ఉన్నారు.

News October 7, 2024

NLG: రైతులకు మేలు చేసే విధంగా ఉండాలి: మంత్రి కోమటిరెడ్డి

image

వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతులకు మేలు చేసే విధంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం అయన DVK నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతులకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేదే వ్యవసాయ మార్కెట్ కమిటీ అని చెప్పారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు మేలు చేయడమే ధ్యేయంగా పని చేయాలన్నారు.