News April 12, 2025
NLG: ఆస్తికోసం కూతురిని చంపిన సవతి తల్లి

ఆస్తికోసం కూతురిని పినతల్లి చంపిన ఘటన గతేడాది DEC 7న జరగ్గా పోలీసులు ఈ కేసును ఛేదించారు. వారు తెలిపిన వివరాలిలా.. కూతురిని సవతితల్లి హతమార్చి వంగమర్తి వాగులో మృతదేహాన్ని పూడ్చారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో మేడిపల్లి PSలో మిస్సింగ్ కేసు నమోదైంది. మహేశ్వరి మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు.
Similar News
News December 22, 2025
రంగారెడ్డి జిల్లా రిటైర్డ్ DMHOపై ఫిర్యాదు

వనస్థలిపురం PS పరిధిలోని హస్తినాపురంలో ఉన్న అరుణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరును అక్రమంగా, ఆరుష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మార్చారని రంగారెడ్డి జిల్లా రిటైర్డ్ DMHO, ప్రస్తుత DEMOపై ఆరోపణలు వచ్చాయి. గతంలో అదే హాస్పిటల్‌కు MDగా పనిచేసిన Dr.దేవేందర్ RR కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో ఈమేరకు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్‌పై ఎన్నో కేసులు ఉన్నా.. పేరు ఎలా మారిందని ప్రశ్నించారు.
News December 22, 2025
ఈ ఫుడ్స్‌లో పుష్కలంగా ప్రొటీన్లు!

శరీరానికి అవసరమైన పోషకాలలో ప్రొటీన్ ఒకటి. కండరాల పెరుగుదల, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. 100గ్రాముల సోయాబీన్స్‌లో 36.5 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అలాగే జనపనార గింజలు(31.6g), సన్‌ఫ్లవర్ సీడ్స్(20.8g), అవిసెలు(18.3g), పెసరపప్పు(24.0g), రాజ్మా(23.6g), కందులు(22.3g), వేరుశనగలు(25.8g), బాదం(21.2g), పన్నీర్(18.0g), పెరుగు(3.5g), పాల నుంచి 3.3 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది.
News December 22, 2025
సొంత పార్టీ నేతలను తొక్కుకుంటూ పోయిన చరిత్ర నీది: హరీశ్

TG: ఫోర్త్ సిటీ ఎందుకన్న <<18633868>>కేసీఆర్<<>> ప్రశ్నకు రేవంత్ ఎందుకు సమాధానమివ్వలేదని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ప్రశ్నించారు. ‘నిన్న చిట్ చాట్‌లో రేవంత్ అన్ని అబద్ధాలు చెప్పారు. BRS పాలనను అనేకమంది ప్రశంసించారు. సొంత పార్టీ నేతలను తొక్కుకుంటూ పోయిన చరిత్ర నీది రేవంత్. నీకు నీతి ఎక్కడుంది? రేపు ఎక్కడ ఉంటావో నీకే తెలియదు. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తావు’ అని ఫైరయ్యారు.


