News October 22, 2025
NLG: ఆ ఊరిలో ఒక్క బెల్టు షాపు లేదు

తిప్పర్తి మండలంలోని కాశివారిగూడెం గ్రామం ఒక్క బెల్టు షాపు కూడా లేని ఆదర్శంగా నిలిచింది. గ్రామ పెద్దలు, యువత, మహిళలు ఏకమై గ్రామంలో మద్యం అమ్మకాలపై పూర్తిగా నిషేధం విధించి, కఠిన చర్యలు చేపట్టారు. దీని ఫలితంగా గ్రామం ప్రశాంతంగా, శుభ్రంగా మారింది. స్వచ్ఛమైన జీవన విధానానికి నిదర్శనంగా నిలుస్తున్న కాశివారిగూడెం గ్రామం, ఇతర గ్రామాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
Similar News
News October 22, 2025
పారిశుద్ధ్యం, నీటి విషయంలో శ్రద్ధ వహించాలి: కలెక్టర్

పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించటంతో పాటు రక్షిత తాగునీరు సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్ వీసీ హాల్లో బుధవారం తమీమ్ అన్సారియా మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణాల్లో మంచినీటి సరఫరా, వ్యర్ధాల సేకరణ, నిర్వహణ, సాలిడ్, లిక్వీడ్ వ్యర్ధాల నిర్వహణ ప్రాజెక్టుల పై ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు.
News October 22, 2025
జనగామ: 31న జిల్లా స్థాయి యువజన కళాకారుల ఎంపిక

జాతీయ యువజన ఉత్సవాల సందర్భంగా ఈనెల 31న జనగామ జిల్లా స్థాయి యువజన కళాకారుల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి కోదండరాములు తెలిపారు. ఆసక్తి ఉన్న 15 నుంచి 29 ఏళ్లలోపు వారు ఈనెల 29లోపు కలెక్టరేట్లోని జిల్లా యువజన కార్యాలయంలో(ఎస్-15) పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9652197323ను సంప్రదించాలన్నారు.
News October 22, 2025
భారీ వర్షసూచన.. మరో 2 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: రాయలసీమతో పాటు పలు జిల్లాలకు వాతావరణశాఖ రేపు భారీ వర్షసూచన చేసింది. ఈ నేపథ్యంలో మరో 2 జిల్లాల స్కూళ్లకు సెలవులిచ్చారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్లు కడప డీఈవో శంషుద్దీన్, అన్నమయ్య డీఈవో సుబ్రహ్మణ్యం ప్రకటించారు. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు రేపు స్కూళ్లకు సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ GNT, కృష్ణా, చిత్తూరు తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.