News October 24, 2025

NLG: ఆ ఒక్క వైన్స్ నుంచే రూ.4.56 కోట్ల ఆదాయం

image

నల్గొండ జిల్లా ధర్వేశిపురం వైన్స్‌కు అత్యధికంగా 152 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున ఆ ఒక్క వైన్స్ నుంచే రూ.4.56 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే జిల్లాలో ఉన్న షాపుల్లో గతంలో కూడా ఈ వైన్స్‌కు అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఒక్కొక్కరు పదుల సంఖ్యలో ఆ వైన్స్‌కు దరఖాస్తులు చేసినా సింగిల్ దరఖాస్తు చేసిన వ్యక్తికే టెండర్లో వైన్స్ దక్కింది. ఈసారి పెద్ద ఎత్తున దరఖాస్తులు వేశారు.

Similar News

News October 24, 2025

NLG: ఆ గ్రామానికి రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం

image

చిట్యాల(M) ఉరుమడ్లకు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గ్రామానికి చెందిన గుత్తా మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా వ్యవహరించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీగా, ప్రస్తుతం మండలి ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు, కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా ఉండగా, అమిత్ రెడ్డి రాష్ట్ర డైరీ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఒకే గ్రామం నుంచి ఇంత మంది రాజకీయంగా గుర్తింపు పొందడం విశేషం.

News October 24, 2025

ప్రభుత్వం పంపిన ప్రశ్నాపత్రాలే వాడాలి: డీఈవో

image

నల్గొండ జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో ప్రభుత్వం పంపిన ప్రశ్నాపత్రాలతోనే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి ఈనెల 31 వరకు ఎస్ఏ-1 పరీక్షలను నిర్దేశించిన కాలనిర్ణయం పట్టిక ప్రకారం నిర్వహించాలని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News October 24, 2025

నల్గొండ: ఆక్యుపెన్సీ సరే.. ప్రయాణికుల రద్దీ సంగతేంది?!

image

నల్గొండ జిల్లాలో మహాలక్ష్మి పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెరిగినా, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో బస్టాండ్‌లో నిత్యం బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో అధికారులు తక్షణమే అదనపు బస్సులు నడపాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.