News February 6, 2025
NLG: ఇంటర్ ప్రాక్టికల్స్‌కు 357 మంది గైర్హాజరు
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు బుధవారం 357 మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రాక్టికల్స్‌కు మొత్తం 2760 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 2507 మంది హాజరయ్యారు. 253 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ప్రాక్టికల్స్‌కు 1985 మంది హాజరుకావాల్సి ఉండగా 1881 మంది పరీక్ష రాశారు. 104 మంది గైర్హాజరయ్యారు.
Similar News
News February 6, 2025
నల్గొండ: మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం యాసంగి కాలానికి సంబంధించిన రైతు భరోసా నిధులను గత నెల 27వ తేదీన కొంతమంది రైతులకు విడుదల చేసింది. సీఎం ఆదేశాల ప్రకారం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఒక ఎకరం ఉన్న రైతులకు ఎకరానికి రూ.6,000 చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గత నెల 27వ తేదీ నుంచి బుధవారం వరకు 1,55,232 మంది రైతుల అకౌంట్లో రైతు భరోసా నిధులు జమ అయ్యాయి.
News February 6, 2025
నల్గొండ: శుభకార్యాలకు అద్దెకు ఆర్టీసీ బస్సులు
TGS RTC నల్గొండ రీజియన్‌లోని అన్ని డిపోలలో వివాహాది శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన బస్సులు అందజేస్తామని ఉమ్మడి నల్గొండ జిల్లా రీజనల్ మేనేజర్ కె. జానీ రెడ్డి తెలిపారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను అద్దెకు తీసుకోవచ్చున్నారు. ప్రతి కిలోమీటర్‌పై గతంలో కంటే రూ.7 తగ్గింపు ఉందని, 6 గంటల వెయిటింగ్ చార్జ్ మినహాయింపు ఉంటుందన్నారు. వివరాలకు సమీప డిపోలను సంప్రదించాలని సూచించారు.
News February 6, 2025
ఎంజీయూలో అధికారుల పదవీకాలం పొడిగింపు
ఎంజీ యూనివర్సిటీలో వివిధ విభాగాలలో సేవలందిస్తున్న వివిధ అధికారుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ సూచన మేరకు రిజిస్ట్రార్ ఆచార్య అలవాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షల నియంత్రణ అధికారిగా సేవలందిస్తున్న డా జి.ఉపేందర్ రెడ్డిని మరో ఏడాది, ఐక్యూ ఏసీ డైరెక్టర్ డా.మిరియాల రమేశ్, ఆడిట్ సెల్ అడిషనల్ డైరెక్టర్‌గా డా వై.జయంతిని మరో ఏడాది కొనసాగించనున్నారు.