News July 15, 2024

NLG: “ఇంటింటా ఇన్నోవేషన్” గోడపత్రిక ఆవిష్కరణ

image

గ్రామీణ ప్రాంత ఆవిష్కర్తలకు సాధికారత కల్పించడంలో భాగంగా తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో రూపొందించిన “ఇంటింటా ఇన్నోవేషన్” గోడపత్రికను కలెక్టర్ సి.నారాయణరెడ్డి సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఆవిష్కర్తలు ఆగస్టు 3లోగా నూతన ఆవిష్కరణలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను సెల్ ఫోన్ నెంబర్ 9100678543 నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించాలని ఆయన అన్నారు.

Similar News

News October 1, 2024

జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం

image

ఉమ్మడి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పదవి కాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. అందులో భాగంగా ఓటర్ నమోదుకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

News October 1, 2024

డీఎస్సీ ఫలితాలలో సత్తాచాటిన నల్గొండ జిల్లా

image

నిన్న వెల్లడైన డీఎస్సీ ఫలితాలలో నల్గొండ జిల్లా వాసులు సత్తా చాటారు. పిల్లి సైదులు(గట్లమల్లేపల్లి)1వ ర్యాంక్ పీఈడీ, పల్లెభవాని (మునుగోడు) జీవశాస్త్రం1వ ర్యాంక్, హనుమంతు అనిల్ (త్రిపురారం) వ్యాయామం 2వ ర్యాంక్, ఎండీ కలీమెద్దీన్ (చిట్యాల) హిందీ 2వ ర్యాంక్, విజయేంద్రచారి (హాలియా) సోషల్ 4వ ర్యాంక్, వలిశెట్టి యాదగిరి (ఆకారం) సోషల్ 5వ ర్యాంక్ సాధించారు.

News October 1, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ముఖ్య సమాచారం

image

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ ప్లో 49,651 క్యూసెక్కులు కొనసాగుతుంది. జల విద్యుత్ కేంద్రానికి 28,435, కుడి కాల్వకు 10,425, ఎడమ కాల్వకు 6,781, ఎస్ఎల్బీసీకి 2,400, వరద కాల్వకు 800 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.