News November 13, 2025

NLG: ఇందిరమ్మ లబ్ధిదారులకు మరుగుదొడ్లు

image

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్దిపొందిన వారికి వ్యక్తిగత మరుగుదొడ్లు కేటాయించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మొత్తం 34,023 ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు వెంటనే వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో 19,697 ఇండ్లు మంజూరయ్యాయి. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ)లో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి వీరికి మరుగుదొడ్లను మంజూరు చేయనున్నారు.

Similar News

News November 13, 2025

కట్టంగూర్: వెయ్యి కొట్టు.. ఫ్లాట్ పట్టు

image

ఆపదలో అక్కరపడతాయని కొనుగోలు చేసిన స్థిరాస్తులను అమ్మేందుకు యజమానులు పడరాని పాట్లు పడుతున్నారు. చివరకు లక్కీ డ్రా పేరుతో ప్లాట్లను విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కట్టంగూర్‌కు చెందిన మేకల రమేష్.. ‘వెయ్యి కొట్టు ప్లాటు పట్టు’ అంటూ బ్రోచర్లను సిద్ధం చేసి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంబేడ్కర్ నగర్ కాలనీలో 147 గజాల ప్లాట్ లక్కీ డ్రా తరహాలో బేరానికి పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

News November 12, 2025

నల్గొండలో సదరం కేంద్రం ప్రారంభించిన మంత్రి

image

దివ్యాంగుల కోసం నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు జారీ కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ కేంద్రం ద్వారా దివ్యాంగులకు వైకల్య గుర్తింపు కార్డులు సులభంగా, వేగంగా లభించే సదుపాయం కలుగుతుందని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ముఖ్యమైన ముందడుగు అని మంత్రి పేర్కొన్నారు.

News November 12, 2025

నల్గొండకు మరో అరుదైన గౌరవం

image

ప్రాంతీయ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ (S&T) ఆధారిత పరిష్కారాలను రూపొందించడంలో చురుకుగా ఉన్న నల్గొండ జిల్లా యంత్రాంగానికి అరుదైన ఆహ్వానం లభించింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు (PSA) కార్యాలయం ఢిల్లీలో డిసెంబర్‌లో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ‘S&T క్లస్టర్స్: మేకింగ్ లైవ్స్ ఈజియర్’ అంశంపై జరిగే ఈ సదస్సు ఆహ్వానం కలెక్టర్‌కు అందింది.