News March 14, 2025
NLG: ఇది ప్రకృతి హోలీ

హోలీ పండగ రోజు ఇద్దరు చిన్నారులు ఆదర్శంగా నిలిచారు. మార్కెట్లో దొరికే కృత్రిమ రంగులకు స్వస్తి పలికారు. బీబీనగర్ మం. పరిధిలోని పడమటి సోమారం గ్రామానికి చెందిన సుభిక్షిత్, అభిజ్ఞ అన్నాచెల్లెలు. హోలీ పండగ కోసం తమ గ్రామంలో విరబూసిన మోదుగు పూలను సేకరించారు. స్వయంగా రంగు నీళ్లు సిద్ధం చేశారు. సహజసిద్ధమైన ఈ నీళ్లను చల్లుకుంటూ హోలీ ఆడారు. ఇక మీదటైనా ప్రకృతి నడుమ ‘హోలీ’ జరుపుకుందాం.
Similar News
News September 17, 2025
1-12 తరగతుల వరకు మార్పులు: CM

TG: విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడమే తన ధ్యేయమని CM రేవంత్ అన్నారు. నూతన విద్యా విధానం రూపకల్పనపై అధికారులతో సమీక్షించారు. ‘పేదరిక నిర్మూలనకు విద్య ఒక్కటే మార్గం. 1-12 తరగతుల వరకు మార్పులు జరగాలి. ఎలాంటి నిర్ణయానికైనా నేను సిద్ధం. ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగాలు పొందలేకపోవడానికి నాణ్యత, నైపుణ్యత కొరవడటమే కారణం. మేధావులు, విద్యాధికుల సూచనలతో కొత్త పాలసీ రూపొందించాలి’ అని ఆదేశించారు.
News September 17, 2025
ఫైనల్ చేరిన నీరజ్ చోప్రా

టోక్యోలో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఫైనల్ చేరారు. ఆటోమేటిక్ ఫైనల్ మార్క్ 84.50 మీ. కాగా ఆయన తొలి అటెంప్ట్‌లోనే జావెలిన్‌ను 84.85 మీ. విసిరారు. వెబెర్(జర్మనీ) 87.21 మీ., వెంగెర్(పోలెండ్) 85.67 మీ. విసిరి ఫైనల్లో అడుగుపెట్టారు. ఫైనల్ రేపు జరగనుంది. ఇక 2023లో బుడాపేస్ట్‌లో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ గోల్డ్ కొల్లగొట్టారు.
News September 17, 2025
HYD: పసిప్రాయంలోనే.. పోరాటంలో

1948 SEP 17..గౌలీపురా గల్లీ జనంతో నిండింది. అందరి దృష్టి స్వాతంత్ర్య సమరయోధుడు రాజ్ బహదూర్ గౌర్ చెల్లెలు అవ్‌ధీశ్ రాణి ఇంటి గుమ్మానికి వేలాడుతున్న రేడియోపైనే ఉంది. ‘HYD సంస్థానం భారత్‌లో విలీనమైంది’ అని ప్రకటించగానే ఎగిరి గంతేశారు. దీపావళికి ఇంటికొచ్చిన మగ్దూం, జావేద్ రిజ్వీలను పోలీసుల నుంచి కాపాడింది. ‘పాల్‌రాబ్సన్’ కోడ్‌తో సమరయోధులకు భోజనం, సమాచారం చేరవేసి పోరాటంలో 8ఏళ్లకే భాగమైంది.