News January 7, 2026
NLG: ఇలా చేయకుంటే పెట్రోల్ బంద్

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లాలో ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధనను పకడ్బందీగా అమలు చేయాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయవద్దని జిల్లాలోని అన్ని బంకులకు సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని, ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.
Similar News
News January 8, 2026
ఎమ్మెల్సీ సారయ్య 2.0

వరంగల్ జిల్లాలో MLC బస్వరాజు సారయ్య మాటే శాసనంలా మారింది. ఎప్పుడో జరిగిన కేసుల్లో అక్రమార్కులను సస్పెన్షన్లు చేయిస్తూ, పోలీసులకు దడ పుట్టిస్తున్నారు. మరో పక్క మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సారయ్య పవర్ సెంటర్‌గా మారారు. పనుల కోసం మంత్రి దగ్గరి కంటే ఎమ్మెల్సీ దగ్గరికే ఎక్కువగా వస్తున్నారు. ఇదిలా ఉంటే నిన్న మంత్రి పొంగులేటి రివ్యూలో సైతం అధికారులపై రుసరుసలాడటం చర్చనీయాంశంగా మారింది.
News January 8, 2026
సిద్దిపేట POLICE BOSS నేపథ్యం ఇదే..!

సిద్దిపేట సీపీగా సాధన రష్మి పెరుమాళ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈమె HYDలో నార్త్‌జోన్ డీసీపీగా పనిచేస్తున్న 2019 బ్యాచ్‌కు చెందిన ఈమెను సిద్దిపేట సీపీగా బదిలీ చేశారు. సీపీగా వస్తున్న రష్మి పెరుమాళ్ నేరాలను అరికట్టడంలో పేరు తెచ్చుకున్నారు. మహిళల భద్రతకు పెద్ద పీట వేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫెర్టిలిటీ కేసును పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు.
News January 8, 2026
మెదక్: తీవ్ర విషాదం.. బురదలో రైతు మృతి

కౌడిపల్లి మండలంలో మర్రి చెట్టు తండాలో పొలంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు బురదలో పడి గిరిజన రైతు మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మర్రి చెట్టు తండా చెందిన కాట్రోత్ దినాకర్(28) తన పొలంలో వరి నాటు కోసం పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు జారి బురదలో పడిపోయాడు. స్థానిక రైతులు చూసి దినాకర్‌ను లేపి చూడగా, అప్పటికే చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.


