News October 13, 2025

NLG: ఈసారి కలిసి రాని కాలం.. పాపం కౌలు రైతన్న!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కౌలు రైతులకు ఈసారి కాలం కలిసి రాలేదు. భారీ వర్షాలు ఊహించని దెబ్బతీశాయి. చేతికొచ్చిన పత్తి, వరి పంటలు వేలాది ఎకరాల్లో దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి జిల్లాలోని సుమారు 2 లక్షలకు పైగా కౌలు రైతులు ఉన్నారు. అటు కౌలు చెల్లించేందుకు డబ్బులు లేక, ఇటు పెట్టుబడి తిరిగి చేతికి వచ్చే పరిస్థితి లేక కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Similar News

News October 13, 2025

నగలు నల్లగా మారాయా? ఇలా చేయండి

image

పండుగలు వస్తే చాలు మహిళలు భద్రంగా దాచుకున్న నగలను ఒక్కోటి బయటకు తీస్తారు. కానీ కొన్నిసార్లు ఈ నగలు నల్లగా మారి, మెరుపు తగ్గుతాయి. దీనికోసం కొన్ని టిప్స్ పాటించండి. * వేడినీటిలో డిష్‌వాష్ లిక్విడ్/ షాంపూ వేసి నగలను నానబెట్టాలి. తర్వాత బ్రష్‌తో తోమితే మెరుపు తిరిగొస్తుంది. * బంగారుగాజులను నీటిలో నానబెట్టాలి. శనగపిండిలో వెనిగర్ కలిపి, మెత్తని పేస్టులా చేసి గాజులకు పట్టించి, కాసేపటి తర్వాత కడిగేయాలి.

News October 13, 2025

KNR: TRSMA రాష్ట్ర కన్వీనర్‌గా సౌగాని కొమురయ్య

image

తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ట్రస్మా) రాష్ట్ర కన్వీనర్‌గా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద విద్యా సంస్థల అధినేత సౌగాని కొమురయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా కొమురయ్య మాట్లాడుతూ.. తనను రాష్ట్ర కన్వీనర్‌గా నియమించేందుకు సహకరించిన సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యారంగ అభివృద్ధి కోసం, TRSMA లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తానని మాటిచ్చారు.

News October 13, 2025

నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా

image

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘తక్షకుడు’ మూవీ నేరుగా ఓటీటీలోకి రానుంది. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. ‘అత్యాశ ప్రారంభమైతే ప్రతీకారం వెంటాడుతుంది’ అని రాసుకొచ్చింది. ఈ సినిమాకు ‘మిడిల్ క్లాస్ మెలోడిస్’ డైరెక్టర్ వినోద్ దర్శకత్వం వహించారు.