News December 13, 2025
NLG: ఈసీపై నమ్మకం పోయింది: జగదీష్ రెడ్డి

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దారుణంగా మారిందని, ఈసీపై నమ్మకం పోయిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు, పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి, అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.
Similar News
News December 18, 2025
ములుగు: ముఖ్య నేతల స్వగ్రామాల్లో గెలిచింది వీరే!

ములుగు జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన నేతల స్వగ్రామాల్లో ఇలా..
మంత్రి సీతక్క స్వగ్రామం జగ్గన్నపేటలో కాంగ్రెస్, జిల్లా అధ్యక్షుడు అశోక్ స్వగ్రామం చల్వాయిలో కాంగ్రెస్, బడే నాగజ్యోతి కాల్వపల్లి కాంగ్రెస్, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు ఏటూరునాగారంలో బీఆర్ఎస్, మాజీ రెడ్కో ఛైర్మన్ సతీశ్ రెడ్డి దేవగిరిపట్నంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
News December 18, 2025
కామారెడ్డి: ఆ మండలంలో స్వతంత్ర సర్పంచులు ఎక్కువ

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలంలో ఏకంగా 18 మంది సర్పంచ్‌లు స్వతంత్రులు కావడం విశేషం. మండలంలో 31 గ్రామాల్లో సర్పంచ్ స్థానాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుతో బరిలో దిగిన అభ్యర్థులను కాదని ఓటర్లు స్వతంత్రుల వైపు మొగ్గు చూపారు. అధికార కాంగ్రెస్(9), ప్రతిపక్ష బీఆర్ఎస్(4) సాధించుకున్న సీట్ల మొత్తాన్ని కలుపుకున్నా స్వతంత్రులే అధికంగా ఉండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
News December 18, 2025
ఆరోగ్యం, ఐశ్వర్యం తిరిగి పొందేందుకు..

అశాంతి, అనారోగ్యం, ఐశ్వర్య నష్టం మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే పరమేశ్వరుడిని ప్రసన్నం చేసే రుద్రహోమం మీకు సరైనది. ఇందులో శ్రీరుద్రం, శివ పంచాక్షరి వంటి మంత్రోచ్ఛారణలతో పాటు పరమేశ్వరుడికి ప్రీతికరమైన ఆహుతులను పూజారులు అగ్నికి సమర్పిస్తారు. దీంతో అనారోగ్యం, నెగెటివ్ ఎనర్జీ దూరమై శివుడి అనుగ్రహంతో అర్థ, అంగ బలం పొందుతారు. అందుబాటు ఛార్జీల్లో పూజ, వివరాల కోసం <


