News December 19, 2024
NLG: ఉచిత శిక్షణకు అప్లై చేసుకోండి
ఈ నెల 30న టైలరింగ్ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ ఎ.అనిత తెలిపారు. పదో తరగతి పాస్, ఫెయిల్ అయిన మహిళలు అప్లై చేసుకోవాలన్నారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉండి యోగ్యతా పత్రం కలిగిన వారు అర్హులన్నారు. టైలరింగ్‌లో 30 సీట్లు ఉన్నాయని, శిక్షణ 45 రోజులు ఉంటుందని చెప్పారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 5, 2025
NLG: పరిషత్తు.. కసరత్తు
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. తాజాగా మండల జిల్లా పరిషత్ ఎన్నికలే మొదట నిర్వహిస్తామని చెబుతుండటంతో యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేస్తుంది. జిల్లాలో 33 జడ్పీటీసీలు, 352 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న GP ఓటర్ల జాబితా ఆధారంగా ఎంపీటీసీ ఓటర్ల జాబితాను తయారు చేయనున్నారు.
News February 5, 2025
ఈనెల 7న బుద్ధవనంలో ‘త్రిపీటక పఠనోత్సవం’
నాగార్జునసాగర్ హిల్ కాలనీ బుద్ధవనంలో ఈనెల 7న మహాబోధి సొసైటీ సికింద్రాబాద్, అంతర్జాతీయ త్రిపీటక సంగాయన మండలి ఆధ్వర్యంలో త్రిపీటక పఠనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా బౌద్ధ ధార్మిక సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణ కోసం నిర్వహించే కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన 200 మంది బౌద్ధ బిక్షువులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
News February 5, 2025
NLG: బీడు భూముల్లో బంగారం పండిస్తున్నాడు
నల్గొండ జిల్లా చందంపేట మండలం అంటేనే బీడు భూములు, కరువు కాటకాలతో కూడిన ప్రాంతం. భూగర్భ జలాలు లేక రైతులు అల్లాడుతుంటారు. ఆ బీడు భూముల్లోనే బంగారం పడిస్తున్నాడు రైతు పద్మారెడ్డి. వినూత్నంగా తన 12ఎకరాల్లో 1991లోనే 1200 కుంకుడు మొక్కలు నాటి ఎకరాకు రూ.5వేల పెట్టుడితో రూ.13లక్షల ఆదాయం పొందుతున్నాడు. ఎకరాకు 25 నుంచి 30 టన్నుల దిగుబడి సాధిస్తూ.. కిలో కుంకుడుకాయలు రూ.120 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నాడు.