News January 29, 2025
NLG: ఉచిత శిక్షణకు ఆఖరి తేదీ ఫిబ్రవరి 9

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన అర్హులైన BS, EBC, SC, ST అభ్యర్థులకు SSC, RRB, బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉపాధి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం సంచాలకుడు ఖాజా నజీమ్ అలీ అఫ్సర్ తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ ఉత్తీర్ణులై, 18 నుంచి 39 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలన్నారు. ఫిబ్రవరి 9 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News February 25, 2026
NLG: సెల్లులు స్విచాఫ్.. అజ్ఞాతంలో రైస్ మిల్లర్లు..!

జిల్లాలో కోట్లాది రూపాయల ప్రభుత్వ ధాన్యం కుంభకోణానికి పాల్పడిన మిల్లర్లు పోలీసులకు దొరకకుండా పరారయ్యారు. తమపై కేసులు నమోదు కాబోతున్నాయనే ముందస్తు సమాచారంతో శనివారం నుంచే వారంతా ఫోన్లు స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంపై ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పందించారు. ప్రభుత్వ ధాన్యాన్ని లూటీ చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంటామన్నారు.
News February 25, 2026
నల్గొండ: ఇంటర్ పరీక్షలకు 45 సెంటర్స్

నల్గొండ జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టర్ బి.చంద్రశేఖర్ మంగళవారం సమీక్ష నిర్వహించి వివరాలు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 45 కేంద్రాలలో 27,018 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించాలని, విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని అధికారులు సూచించారు.