News January 28, 2025
NLG: ఉపాధి అవకాశాల కోసం ‘DEET ‘

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ యాప్‌ను ప్రారంభించినట్లు NLG ఉపాధి కల్పన అధికారి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఈ ఆన్‌లైన్ యాప్లో నిరుద్యోగులు ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా నమోదు చేసుకోవచ్చన్నారు.
Similar News
News September 15, 2025
NLG: దొడ్డు బియ్యంపై మౌనమేల?

NLG జిల్లాలోని రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ముక్కిపోతున్నాయి. జిల్లాలో గోదాములు, MLS పాయింట్లతో పాటు రేషన్ షాపుల్లో 6వేల మెట్రిక్ టన్నుల వరకు దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వాటిని ఏం చేయాలో తెలియక రేషన్ డీలర్లు సైతం ఇబ్బంది పడుతున్నారు. దొడ్డు బియ్యం నుంచి పురుగులు సన్నబియ్యానికి పడుతున్నాయని లబ్ధిదారులు అంటున్నారు.
News September 15, 2025
NLG: 17 నుంచి పోషణ మాసం షురూ

ఆరోగ్యకర సమాజ నిర్మాణంతో పాటు మాతా శిశు సంరక్షణ కోసం అధికారులు పోషణ మాసం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోషణ్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఉద్యమంగా భావించి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నల్గొండ జిల్లాలోని 2,093 అంగన్వాడి కేంద్రాల్లో ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు పోషణ మాసం నిర్వహించనుంది. అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు చూసి రిజిస్టర్లో నమోదు చేయనున్నారు.
News September 15, 2025
NLG: సిరులు కురిపించనున్న తెల్ల బంగారం..!

పత్తి సాగు నల్గొండ జిల్లా రైతులకు సిరులు కురిపించనుంది. జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయ శాఖ అంచనాలకు మించి రైతులు పత్తి పెద్ద ఎత్తున సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 5,47,735 ఎకరాల్లో పత్తి సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేయగా అంచనాకు మించి 5,64,585 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. జిల్లాలో మొదటి దశ పత్తితీత పనులను ఇటీవల రైతులు ప్రారంభించారు. 45 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా.