News February 9, 2025

NLG: ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఓట్ల వేట!

image

MLC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 10వ తేదీ వరకు అవకాశం ఉండగా పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ 13తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ వేసిన అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా అదృష్టం పరీక్షించుకునేందుకు బరిలో దిగుతున్నారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు నోటిఫికేషన్‌ ముందు నుంచే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Similar News

News February 1, 2026

మిర్యాలగూడకు సీఎం రేవంత్ రెడ్డి.. ప్రచార హోరు!

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 4వ తేదీన నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా సీఎం స్వయంగా రంగంలోకి దిగుతుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే స్థానిక నేతలు సభకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

News February 1, 2026

NLG: పెన్షన్ కోసం టెన్షన్..

image

ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో జాప్యం చేయడంతో జిల్లాలోని వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో అన్ని రకాల పెన్షన్లు కలిపి సుమారు 2.04 లక్షలు ఉండగా, వీటి పంపిణీకి నెలకు సుమారు రూ. 47.34 కోట్ల నిధులు అవసరం అవుతున్నాయి. ప్రస్తుతం డిసెంబర్, జనవరికి సంబంధించిన పెన్షన్లు ఇంకా పంపిణీ కాకపోవడంతో పెన్షన్లపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వృద్ధులు, నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News February 1, 2026

NLG: సీపీఎం అభ్యర్థుల జాబితా విడుదల

image

జిల్లాలోని మున్సిపాలిటీలు, NLG కార్పొరేషన్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రకటించారు. NLG కార్పొరేషన్లో 20వ డివిజన్ మహ్మద్ సలీం, MLG మున్సిపాలిటీ 3వ వార్డు ఏకాల పద్మ, 9వ వార్డు ఎస్సీ దోరెపల్లి మల్సూర్, 15 వార్డు రాజుగని కుమారి, 17వ వార్డు మల్లు మధులత, 29వ వార్డు డబ్బికార్ మల్లేశం, 41 వ వార్డు అజారాల, చిట్యాలలో ఒకటో వార్డు జిట్టా నగేష్‌కు కేటాయించారు.