News May 13, 2024
NLG: ఎన్నికలు.. ఇలా చేస్తే కేసుల్లో ఇరుక్కుంటారు

లోక్సభ ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల వద్ద యువత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఇలా చేయకండి.
⏵ఓటర్లను ప్రైవేటు వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలింపు
⏵శాంతి భద్రతల ఆటంకం
⏵ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం
⏵ఓటర్లకు నగదు, బహుమతుల పంపిణీ
⏵మాదకద్రవ్యాలు పంచడం, తరలించడం
⏵రెచ్చగొట్టే ప్రసంగాలు, దాడులు
⏵అసత్య వార్తలు వ్యాప్తి
Similar News
News September 13, 2025
సత్తా చాటిన నల్గొండ పోలీస్

హైదరాబాద్లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో మూడు రోజులపాటు నిర్వహించిన 7వ ఆల్ ఇండియా జైళ్ల శాఖ క్రీడల్లో 24 రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఈ క్రీడల్లో నల్గొండ జిల్లా జైలు పోలీస్ మామిడి చరణ్ 80 కిలోల విభాగంలో కరాటే పోటీల్లో స్వర్ణ పతకం సాధించి తెలంగాణకు గౌరవం తీసుకొచ్చాడు. ఈ విజయంపై జైలు అధికారులు, పోలీసులు శ్రావణ్, గణేష్, సైదులు, రాంబాబు అభినందనలు తెలిపారు.
News September 13, 2025
నల్గొండ: ఆర్టీసీకి రూ.32.59 లక్షల ఆదాయం

నల్గొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల నుంచి వివిధ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా నాలుగు నెలల్లో రూ.32.59 లక్షల ఆదాయం సమకూరిందని ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. జూన్లో 22 బస్సులతో రూ. 11.95 లక్షలు, జూలైలో 22 బస్సులతో రూ. 13 లక్షలు, ఆగస్టులో 18 బస్సులతో రూ. 6.47 లక్షలు, సెప్టెంబర్లో 3 బస్సులతో రూ. 1.16 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆయన వివరించారు.
News September 12, 2025
అధిక ధరకు యూరియా విక్రయిస్తే చర్యలు: ఎస్పీ

యూరియాను అక్రమంగా నిల్వ చేసినా, అధిక ధరకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియాను సకాలంలో అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీపై సరఫరా అవుతున్న యూరియాను ఎవరైనా అధిక ధరకు విక్రయిస్తే, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.