News February 4, 2025
NLG: ఎమ్మెల్సీ స్థానానికి రెండవ రోజు నామినేషన్‌ల దాఖలు నిల్
వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం నుంచి నామినేషన్‌ల పర్వం మొదలైన విషయం తెలిసిందే. మొదటి రోజు ప్రజా వాణి పార్టీ నుంచి లింగిడి వెంకటేశ్వర్లు ఒకసెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. మంగళవారం ఏలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో నామినేషన్‌ల పర్వం మొదలైన రెండవ రోజుకు ఒకే నామినేషన్ దాఖలైంది.
Similar News
News February 4, 2025
UPDATE: దేవరకొండ మృతదేహం వెంకటేష్‌గా గుర్తింపు.!
దేవరకొండ పట్టణ శివారులోని తాటికోల్ రోడ్డు భాగ్యనగర్ సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. మృతుడు ఉప్పునూతల వెంకటేష్ యాదవ్‌గా కుటుంబీకులు గుర్తించారు. మృతుడు వెంకటేష్ చనిపోయే మనస్తత్వం కాదని, చాలా ధైర్యం కలవాడని కుటుంబీకులు తెలిపారు. వెంకటేష్ మృతిపైన పలు అనుమానాలు ఉన్నాయని, హత్య చేసి, ఉరి వేసుకున్నట్టు చిత్రీకరించారని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు.
News February 4, 2025
NLG: తొలిరోజు ఒక్క నామినేషన్ దాఖలు
వరంగల్ – ఖమ్మం- నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు ప్రజావాణి పార్టీ అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్లు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 10 వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని, ఈనెల 8, 9 తేదీలలో ప్రభుత్వ సెలవు దినాలలో ఎలాంటి నామినేషన్లు స్వీకరించడం జరగదని తెలిపారు.
News February 4, 2025
ఎంజీయూ ఆధ్వర్యంలో ఐసెట్ నిర్వహణ
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కొరకు నిర్వహించనున్న ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఐసెట్) -2025ను ఈ ఏడాది నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ కన్వీనర్ అల్వాల రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఐసెట్ నోటిఫికేషన్ ను మార్చి 6వ తేదీన విడుదల చేసి జూన్ 8, 9 తేదీల్లో ఆన్‌లైన్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.