News October 3, 2025
NLG: ఎస్టీ ఓట్లే లేవు.. రిజర్వేషన్ మాత్రం వారికే..!

అనుముల (M) పేరూరు పంచాయతీలో ఎస్టీ జనాభాయే లేదు. కానీ ప్రభుత్వం ఆ పంచాయతీని ఎస్టీ మహిళకు రిజర్వు చేయడంతో గ్రామస్థులు అవాక్కయ్యారు. ఇక్కడ మొత్తం 792 మంది ఓటర్లున్నారు. అందులో 421 మంది మహిళలు, 371 మంది పురుషులు. వీరిలో 665 మంది బీసీ ఓటర్లు కాగా, 107 మంది ఎస్సీలు, 20 మంది ఓసీ ఓటర్లు ఉన్నారు. అధికారులు ఎన్నికల జాబితాలో ఎక్కడా ఎస్టీ ఓట్లను చూపించలేదు. కానీ పంచాయతీని మాత్రం ఎస్టీ మహిళకు రిజర్వ్ చేశారు.
Similar News
News October 3, 2025
భువనగిరి: మద్యం దుకాణాలకు ఎన్ని దరఖాస్తులంటే..

జిల్లాలో మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ సాగుతోంది. జిల్లాలో 82 మద్యం దుకాణాలకు గత నెల 26 నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు .26వ తేదీ నుంచి నేటి వరకు 62 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం నాలుగు స్టేషన్లకు భువనగిరి 24, రామన్నపేట13, ఆలేరు 20, మోత్కూరు 10 వచ్చినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి తెలిపారు. ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
News October 3, 2025
భవిష్యత్ అవసరాలు ముందే గుర్తించాలి: కలెక్టర్

వ్యవసాయం, వాటి అనుబంధ రంగాల్లో పెట్టుబడి తగ్గి రైతులకు లాభం పెరగాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రాథమిక రంగాల శాఖలతో శుక్రవారం కలెక్టర్ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రాథమిక రంగాల శాఖలు నూతన ఆవిష్కరణలు దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రాథమిక రంగాల్లో ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మకంగా పరిశీలించాలని, ఏ అంశాన్ని సాధారణంగా తీసుకోరాదని, భవిష్యత్తులో అవసరాలను ముందుగా గుర్తించాలన్నారు.
News October 3, 2025
‘భూతం’ అంటే చెడు శక్తులు కాదా?

కాంతార మూవీలోని భూత-కోలా ఆచారంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది దైవమని కొందరు, దుష్ట శక్తి అని ఇంకొందరు నమ్ముతారు. అయితే ‘భూత’ అంటే గడిచిన కాలం, ప్రకృతిని రక్షించే శక్తులు అని భాషా వేత్తలు చెబుతున్నారు. అదే ‘భూతం’ అనే పదంగా ప్రతికూల(దుష్ట) శక్తిగా ప్రచారమైందని అంటున్నారు. సినిమాలో చూపించిన భూత కోలా అంటే ప్రకృతి శక్తుల ఆరాధన అని అర్థమట. తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఈ కళను ప్రదర్శించారు. <<-se>>#kanthara<<>>