News April 8, 2025
NLG: ఏసీబీ అయితేనేం.. డోంట్ కేర్!

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కొందరు అధికారులు, ఉద్యోగులకు <<16034547>>ACB <<>>శాఖ ఒకటి ఉంటుందన్న భయం లేకుండా పోతుంది. పట్టుబడితే శాశ్వతంగా ఉద్యోగం పోదని 4 రోజులు ఆగితే మళ్లీ ఉద్యోగంలోకి రావచ్చనే ధీమా అవినీతి అధికారులు, ఉద్యోగుల్లో పెరుగుతోంది. ప్రభుత్వం ఇచ్చే జీతం కన్నా ఎక్కువగా లంచాలకు మరిగిన అధికారులు, ఉద్యోగులు ACBని అసలు పట్టించుకోవడం లేదనడానికి ఇటీవల పట్టుబడిన ఘటనలే నిదర్శనంగా చెప్పవచ్చు.
Similar News
News February 23, 2026
మహిళల ఆరోగ్యానికి తోడ్పడే ప్రోబయోటిక్స్

ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడమే కాకుండా పలు ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయంటున్నారు నిపుణులు. అలాగే పేగులోని అసమతుల్యతను సరిచేసి చర్మ సమస్యలు తగ్గించడంలో, మూడ్ స్వింగ్స్, వెయిట్ మేనేజ్‌మెంట్‌లోనూ సాయపడతాయి. వీటికోసం పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోసె, అరటి,యాపిల్, ఉల్లి, వెల్లుల్లి తీసుకోవాలని సూచిస్తున్నారు.
News February 23, 2026
BREAKING: మాజీ మంత్రి కన్నుమూత

రైల్వే మాజీ మంత్రి, TMC నేత ముకుల్ రాయ్(71) గుండెపోటుతో కన్నుమూశారు. కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో ఆయన చనిపోయినట్లు కుమారుడు సుభ్రాంశు వెల్లడించారు. ముకుల్ ఒకప్పుడు TMC చీఫ్, సీఎం మమతకు సన్నిహితంగా ఉండేవారు. పార్టీలో రెండో స్థానంలో పరిగణించేవారు. అయితే 2017లో ఆయన బీజేపీలో చేరారు. 18 ఎంపీ సీట్లు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. 2021లో కృష్ణానగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మళ్లీ TMCలో చేరారు.
News February 23, 2026
గుంటూరు జిల్లాలో ఇంటర్ పరీక్షల సందడి

గుంటూరు జిల్లా వ్యాప్తంగా మరికాసేపట్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 68,898 మంది విద్యార్థులు హాజరవుతుండగా, వారి కోసం అధికారులు 87 పరీక్షా కేంద్రాలను సర్వం సిద్ధం చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అధికారులు అన్ని కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు.


