News March 6, 2026
NLG: ఐటీఐ అభ్యర్థులకు ‘అప్రెంటిస్‌షిప్ మేళా’

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 9న ‘ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా’ నిర్వహించనున్నారు. స్థానిక అనుముల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ అండాలు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ముందుగా www.apprenticeship.gov.in పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు.
Similar News
News March 6, 2026
ఇరాన్‌పై దాడి.. మోదీకి ముందే చెప్పారా?

ఇరాన్‌పై దాడులకు కొన్ని రోజుల ముందే పీఎం మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఆ సమయంలో ఆయనకు ఆ దేశ ప్రధానమంత్రి నెతన్యాహు దాడి సమాచారం ఇచ్చి ఉండొచ్చనే డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. అయితే దాంట్లో నిజం లేదని భారత్‌లోని ఆ దేశ అంబాసిడర్ అజార్ స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగానే దాడి టైమింగ్ నిర్ణయించామని తెలిపారు. అందుకే మోదీకి ఈ విషయం ముందే తెలిసే ఆస్కారమే లేదని వివరించారు.
News March 6, 2026
మణుగూరులో పెళ్లిరోజే రైల్వే ఉద్యోగి మృతి

మణుగూరు రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే సిగ్నల్ విభాగంలో ఈఎస్ఎం (ESM)గా పనిచేస్తున్న రంప నవీన్(33) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు, నవీన్ తన కొత్తగా కొనుగోలు చేసిన కారును నిలిపేందుకు పాత రన్నింగ్ రూమ్ వద్ద ఉన్న షెడ్డు పీకుతున్న సమయంలో అక్కడ ఉన్న విద్యుత్ వైర్ తగలడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా భార్య 6 నెలల గర్భిణీగా ఉందని సమాచారం.
News March 6, 2026
విచారణ అనంతరం విధుల్లోకి తీసుకుంటాం: SP

గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ గ్రీవెన్స్ డే జరిగింది. ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ సిబ్బంది సమస్యలను తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. శాఖపరమైన చర్యలు ఎదుర్కొంటున్న సిబ్బందిని విచారణ అనంతరం విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తూ పొలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు.


