News August 30, 2025

NLG: ఓటర్ లిస్టులో మీ వివరాలు మార్చాలా?

image

పంచాయతీ ఎన్నికల సమరానికి ఓటర్ జాబితా విడుదలైంది. ఈ జాబితాలో పొరపాట్లు ఉన్నా, కొత్తగా నమోదు చేసుకోవాలన్నా, అభ్యంతరం వ్యక్తం చేయాలన్నా MPDO, పంచాయతీ అధికారికి దరఖాస్తు ఇవ్వాలి.
→ Form-6: కొత్తగా పేరు చేర్చుకోవడానికి
→ Form-7: చెల్లని పేరు తొలగించే అభ్యంతరానికి
→ Form-8: పేరు, అడ్రస్, ఇతర కరెక్షన్స్‌కు
→ Form-8A: ఒక వార్డు నుంచి మరో వార్డుకు మారడానికి

నేడే దీనికి ఆఖరు తేది.

Similar News

News August 30, 2025

NLG: ప్రైవేట్ కళాశాలలపై నియంత్రణ ఏది?

image

జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ, బీఈడీ, డీఈడీ, ఫార్మసిటికల్ కళాశాలలకు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం లేదు. దీంతో ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు ఫీజు చెల్లిస్తేనే వారి స్టడీ సర్టిఫికెట్లు ఇస్తామంటూ వేధింపులకు గురి చేస్తున్నాయి. ఇటీవల కొంతమంది విద్యార్థులు సదరు కళాశాలలపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.

News August 30, 2025

NLG: సెప్టెంబర్ 30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

image

వరల్డ్ స్కిల్ కాంపిటీషన్ – 2025లో పాల్గొనేందుకు SEP 30లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. ఈ పోటీలు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్నవారు www.skillindiadigital.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ పోటీలు యువత తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి, వృత్తిపరంగా ఎదగడానికి గొప్ప అవకాశమని ఆమె పేర్కొన్నారు.

News August 30, 2025

NLG: మామ హత్య.. కోడలు, ప్రియుడికి జీవిత ఖైదు

image

మామను హత్య చేసిన కేసులో కోడలు పద్మ, ఆమె ప్రియుడు వేణుకు జీవిత ఖైదు పడినట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు. 2017 ఆగస్టు 3న నకిరేకల్‌ మండలం పాలెం గ్రామానికి చెందిన పద్మ, ఆమె ప్రియుడుతో ఇంట్లో ఉన్నప్పుడు మామ భిక్షమయ్య చూశాడు. ఈ విషయాన్ని తన కుమారుడికి చెబుతానన్నాడు. దీంతో ఆగ్రహించిన ఇద్దరూ భిక్షమయ్యను హత్య చేశారు. ఈ కేసులో విచారణ అనంతరం కోర్టు వారికి శిక్ష విధించిందని ఎస్పీ వెల్లడించారు.