News April 14, 2024

NLG: ఓటు నమోదుకు రెండు రోజులే అవకాశం!

image

ఓటరు నమోదుకు ఈనెల 15 వరకే అవకాశం ఉంది. లోక్‌ సభ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటు జాబితాలో పేరు ఉండాలి. అయితే 18 ఏళ్లు నిండినా ఇంకా ఓటు హక్కు పొందని వారు వెంటనే నమోదు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం సూచిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అర్హత ఉన్నా.. ఓటు రాదని చాలా మంది ఆందోళనకు గురయ్యారు. ఈ పరిస్థితి రాకుండా ముందస్తుగా తహశీల్దార్, మున్సిపల్ కార్యాలయాలు, బీఎల్వోల వద్ద జాబితా చూసుకోవాలని సూచించారు.

Similar News

News July 11, 2025

NLG: న్యాయవాద వృత్తిలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలో లా కోర్సు చేసిన బీసీ విద్యార్థుల నుంచి న్యాయవాది వృత్తిలో మూడేళ్ల పాటు ఉచిత శిక్షణ పొందేందుకు 2025-26కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన కళాశాల నుంచి లా కోర్స్ పాసై ఉండాలన్నారు. జిల్లాలో నలుగురు అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 11, 2025

NLG: ఈ ఎన్నికల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు

image

బీసీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1740 గ్రామపంచాయతీలు ఉన్నాయి. దీంతో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు దక్కనున్నాయి.

News July 10, 2025

జూలై 18న మూసీ కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల

image

మూసీ ప్రాజెక్ట్ నుంచి వానాకాలం సాగు సీజన్‌కు సంబంధించిన నీటి విడుదలను జూలై 18న ప్రారంభించనున్నట్లు ప్రాజెక్టు డీఈ చంద్రశేఖర్ తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 641.63 అడుగుల నీరు నిల్వ ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు, సూర్యాపేటకు తాగునీరు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.