News January 13, 2025

NLG: కానరాని డూడూ బసవన్నలు

image

‘అయ్యగారికి దండం పెట్టు.. అమ్మవారి ముందు డాన్స్ చెయ్.. చిన్న దొరను సంబరపెట్టు’.. అంటూ సంక్రాంతి వేళ గంగిరెద్దుల వాళ్లు చేసే సందడి మామూలుగా ఉండదు.  సన్నాయి, మృదంగం వాయిస్తూ తిరిగే వ్యక్తులు, బసవన్నకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. పండుగకు నెల ముందే అన్ని ప్రాంతాల్లోనూ ఈ బసవన్నలు బయలుదేరుతారు. కాగా ఉమ్మడి NLG జిల్లాలో మాత్రం ఈ కళ అంతరించిపోయే దశలో ఉంది. మీ ఏరియాలో బసవన్నలు కనిపించారా.. కామెంట్ చేయండి.

Similar News

News January 13, 2025

NLG: పండగ తర్వాత రంగంలోకి బృందాలు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పండుగ తర్వాత సాగు యోగ్యం కాని రాళ్లు, రప్పలు, గుట్టలతో కూడిన భూములను పక్కాగా గుర్తించనున్నారు. నివాస స్థలాలు, రియల్ ఎస్టేట్ భూములు, రహదారులు, పరిశ్రమలు, గోదాములు, మైనింగ్ అవసరాలకు సేకరించిన స్థలాలను పూర్తిగా పరిహరిస్తారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉమ్మడి జిల్లాలో మునుపటి కంటే ‘రైతు భరోసా’ లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.

News January 13, 2025

NLG: ఉమ్మడి జిల్లాలో భోగి సంబురం

image

మూడు రోజుల సంక్రాంతి పండగకు ఉమ్మడి జిల్లాలోని పల్లెలు, పట్టణాలు ముస్తాబయ్యాయి. తొలి రోజు భోగి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణాలు, పల్లెల్లో మహిళలు వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేస్తున్నారు. తీపి వంటకాల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. పల్లెల్లో ఉదయమే భోగిమంటలతో ప్రజలు పండుగకు ఆహ్వానం పలికారు. మరోవైపు చిన్నారులు పతంగులు ఎగరేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

News January 13, 2025

సూర్యాపేట: తాగి వచ్చి వేధింపులు.. భర్త హత్య 

image

సూర్యాపేట జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. చివ్వెంల మండలం గుర్రంతండాకు చెందిన సైదులు కారు డ్రైవర్. అతనికి రమ్య, సుమలత అనే ఇద్దరు భార్యలున్నారు. సైదులు తాగి వచ్చి వారిని వేధిస్తున్నాడు. ఈక్రమంలో ఇద్దరు భార్యలు కలిసి సైదులును ఆదివారం అర్ధరాత్రి హత్య చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.