News April 7, 2025
NLG: కొత్త కార్డుల కోసం ఎదురుచూపులు

రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో రేషన్ తీసుకునే వారి సంఖ్య పెరిగింది. జిల్లాలో ఇంతకు ముందు ఇచ్చే దొడ్డు బియ్యం సగానికి పైగా లబ్ధిదారులు తినకపోవడం.. తీసుకున్న బియ్యం టిఫిన్ల కోసం వినియోగించేవారు. తినడానికి పనికి రాని బియ్యంకోసం ఏం ఆశపడుతామని మౌనంగా ఉన్న కార్డులేని వారు.. సన్న బియ్యం ఇవ్వడంతో తమకు కార్డు ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
Similar News
News October 27, 2025
NLG: నకిలీ స్వీట్ల దందా.. తింటే అంతే సంగతి!

నల్గొండలో కొందరు వ్యాపారులు కాలం చెల్లిన, పురుగులు పట్టిన ముడి పదార్థాలతో స్వీట్లు తయారు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘిస్తూ కొనుగోలుదారులను ఆకర్షించడానికి హానికరమైన రసాయనాలను కలుపుతున్నట్లు ఇటీవల అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఇటువంటి మిఠాయిలు తినడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
News October 27, 2025
NLG: కల్లాల్లోనే ధాన్యం.. త్వరగా కొనరే..!

నల్గొండ జిల్లాలో రైతన్నలను కష్టాలు వెంటాడుతున్నాయి. 186 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు మాత్రం వేగంగా జరగడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను ప్రభావం ఉంటుందని వార్తలు వస్తున్నాయని కల్లాల్లోనే ధాన్యం ఉంటే తీవ్రంగా నష్టపోతామంటున్నారు. కాగా జిల్లాలో ఇంకా 150 కేంద్రాలు తెరుచుకోవాల్సి ఉంది. కొన్ని కేంద్రాల్లో కల్లాలలోని ధాన్యం తడవడంతో పాటు వరదకు కొట్టుకుపోయింది.
News October 27, 2025
నేతలకు సవాల్‌గా నల్గొండ డీసీసీ

నల్గొండ DCC ఎంపిక మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలతో పాటు సీనియర్ నేత జానారెడ్డికి సవాల్‌గా మారింది. బీసీ వైపు మొగ్గుచూపితే చనగాని దయాకర్, పున్న కైలాష్ నేత, చామల శ్రీనివాస్, రాజా రమేష్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ అయితే కొండేటి మల్లయ్యకు ఇచ్చే ఛాన్స్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఓసీ అయితే గుమ్ముల మోహన్ రెడ్డికి డీసీసీ పీఠం దక్కే అవకాశముంది. ఎవరికి వారు అగ్ర నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు.


