News October 28, 2025
NLG: కొనుగోలు కేంద్రాలు సరే.. స్థలమేదీ..!

నల్గొండ జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. కోసిన ధాన్యం ఎక్కడ ఆరబెట్టాలో తెలియక రైతులు సతమతం అవుతున్నారు. కొనుగోలు కేంద్రాలకూ సరిపడా స్థలం లేదు. పది నుంచి 20 రాశులు రాగానే స్థలం కొరత ఏర్పడుతోంది. ధాన్యం సేకరణకు జిల్లాలో ఇప్పటికే 85% ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇందులో కేవలం కొన్ని కేంద్రాలకే అనువైన స్థలాలు ఉన్నాయి. మిగతా కేంద్రాలకు సరైన స్థలాలే లేవని రైతులు అంటున్నారు.
Similar News
News October 28, 2025
NLG: శిశు విక్రయ ఘటనపై సీరియస్… కేసు నమోదు

నల్గొండ జిల్లాలో శిశు విక్రయం ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. శిశువును అమ్మిన తల్లిదండ్రులు బాబు, పార్వతితో పాటు కొనుగోలు చేసిన వ్యక్తులు, మధ్య దళారులుగా వ్యవహరించిన వారిపై కేసు నమోదు చేయాలని నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News October 28, 2025
NLG: గొలుసు చోరీ.. వీరిని గుర్తిస్తే పారితోషకం

త్రిపురారం మండలం నీలయ్యగూడెంలో మహిళ మెడలో నుంచి పుస్తెలతాడును తెంపుకొని వెళ్లిన వ్యక్తులకు సంబంధించిన సీసీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. వారిని గుర్తించిన వారు త్రిపురారం పోలీస్ స్టేషన్‌లో సమాచారమివ్వాలని సూచించారు. త్రిపురారం పోలీస్ స్టేషన్ నంబర్ 87126 70196కి కాల్ చేసి చెప్పొచ్చని హాలియా సీఐ సతీష్ రెడ్డి కోరారు. వారికి తగిన పారితోషకం ఇస్తామని తెలిపారు.
News October 28, 2025
NLG: 21 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎట్టకేలకు 21 ఏళ్ల తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. 1951 నుంచి 2004 వరకూ 8 సార్లు SIR నిర్వహించారు. చివరి సారిగా 21 ఏళ్ల క్రితం 2002-2004 మధ్య చేపట్టారు. జిల్లాలో బీఎల్వోలు త్వరలోనే మ్యాచింగ్ కాని ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఓట్లు ఎలా పొందారో.. దానికి కావాల్సిన పత్రాలను ఓటర్ల నుంచి స్వీకరించనున్నారు.


