News February 25, 2025

NLG: క్విజ్.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే!

image

☞ఎవరికాలంలో నల్గొండ <<15559631>>నీలగిరిగా <<>>ప్రసిద్ధి చెందింది? – శాతవాహనులు
☞భూదానోద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? – ఆచార్య వినోబా భావే
☞దేశోద్ధారక గ్రంథమాలను ఎవరు స్థాపించారు? – వట్టి కోట ఆళ్వారుస్వామి
☞రావి నారాయణరెడ్డి జన్మస్థలం? – భువనగిరి మం. బొల్లేపల్లి
☞‘పల్లెటూరి పిల్లగాడ’ పాటను ఎవరు రచించారు? – సుద్దాల హనుమంతు
SHARE IT..

Similar News

News July 7, 2025

‘అనకాపల్లి జిల్లాలో 1.33 లక్షల మంది లబ్ధిదారులు’

image

అనకాపల్లి జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకానికి 1.33 లక్షల మంది రైతులు అర్హత సాధించినట్లు జిల్లా వ్యవసాయాధికారి మోహన్ రావు ఆదివారం తెలిపారు. వెబ్ ల్యాండ్‌లో వివరాలు సరిగా నమోదు కాని రైతులు 23 వేల మంది ఉన్నట్లు వెల్లడించారు. వీరంతా ఈనెల 10వ తేదీలోగా సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

News July 7, 2025

విజయనగరం జిల్లాలో కూలిన వంతెన

image

సంతకవిటి మండలం కొండగూడెం-ఖండ్యాం మధ్య సాయన్నగెడ్డపై ఉన్న వంతెనపై ఆదివారం రాత్రి కుప్పకూలింది. దీనితో సంతకవిటి, రేగిడి ఆమదాలవలస, బూర్జ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన కూలిన సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఖండ్యాంలో ఇసుక రీచ్‌కు వస్తున్న భారీ లారీల కారణంగా వంతెన కూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే వంతెనకు మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధరించాలని కోరుతున్నారు.

News July 7, 2025

సంగారెడ్డి: కొత్త ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనలు

image

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా మూడు ప్రభుత్వ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు వైద్య విధాన పరిషత్ డీసీహెచ్ఎస్ డాక్టర్ సంగారెడ్డి తెలిపారు. జిల్లాలలోని తెల్లాపూర్, కంగ్టి, గుమ్మడిదల-నర్సాపూర్ జాతీయ రహదారి మధ్య ట్రామా కేర్ సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.