News February 25, 2025
NLG: క్విజ్.. వీటికి సమాధానాలు తెలుసా?

☞ఎవరికాలంలో నల్గొండ నీలగిరిగా ప్రసిద్ధి చెందింది?
☞భూదానోద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?
☞దేశోద్ధారక గ్రంథమాలను ఎవరు స్థాపించారు?
☞రావి నారాయణరెడ్డి జన్మస్థలం?
☞‘పల్లెటూరి పిల్లగాడ’ పాటను ఎవరు రచించారు?
★పై ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ చేయగలరు?
నోట్: మధ్యాహ్నం 2 గంటలకు ఇదే ఆర్టికల్‌లో జవాబులను చూడొచ్చు.
SHARE IT..
Similar News
News February 25, 2025
సీఎం చంద్రబాబును కలిసిన వీహెచ్

AP: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. నిన్న విజయవాడలో ఆయనను కలిసి.. ఏపీలోని ఒక జిల్లాకు దివంగత సీఎం దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని, స్మృతివనం నిర్మించాలని కోరారు. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారని, దళిత సీఎం అయిన సంజీవయ్య అత్యంత నిజాయితీపరుడని వీహెచ్ పేర్కొన్నారు.
News February 25, 2025
బషీరాబాద్: తల్లి, కొడుకు ఆత్మహత్య

బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. ఆ గ్రామానికి చెందిన తల్లి ఎల్లమ్మ (58), కొడుకు మొగులప్ప 36) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 25, 2025
కంచికచర్ల: ప్రమాదంలో ఇద్దరి మృతి.. వివరాలివే..!

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు వద్ద బైకు అదుపు తప్పి డి వైడర్ను ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు ఉయ్యూరు ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ (25), కరిముల్లా(30),లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి ఉయ్యూరుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.