News August 17, 2024
NLG: క్షేత్రస్థాయిలో LRS దరఖాస్తుల తనిఖీలు

LRS దరఖాస్తులను క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించి జాగ్రత్తగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర అన్నారు. LRS దరఖాస్తుల పరిష్కారంపై శిక్షణలో భాగంగా ఈ నెల 14న జిల్లాలోని 15 మండల బృందాలకు శిక్షణ ఇవ్వగా.. శుక్రవారం తక్కిన మండల బృందాలకు శిక్షణ ఇచ్చారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Similar News
News February 21, 2026
నల్గొండ: ఆందోళన కలిగిస్తున్న మరణాలు

నల్గొండ జిల్లాలో శుక్రవారం విషాదం నిండిన రోజుగా మిగిలింది. వేర్వేరు ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఆందోళన కలిగిస్తున్నాయి. మామిడాలలో అప్పుల బాధతో సంతోశ్ ఉరివేసుకోగా, తెట్టకుంటలో మానసికస్థితి సరిగా లేక నర్సమ్మ నిప్పంటించుకుని మృతి చెందింది. నకిరేకల్‌లో గీత కార్మికుడు వెంకటేశం చెట్టుపై నుంచి పడి, మండలాపురంలో తల్లిదండ్రులు మందలించారని మహేశ్ గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.
News February 21, 2026
సాగర తీరానికి జలకళ.. పర్యాటకులకు ప్రకృతి విందు!

ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ జలాశయం క్రమంగా జలకళను సంతరించుకుంటోంది. ఎగువన ఉన్న శ్రీశైలం నుండి విద్యుదుత్పత్తి ద్వారా వస్తున్న వరదతో వారం రోజులుగా సాగర్ నీటిమట్టం పెరుగుతూ పర్యాటకులకు కనువిందు చేస్తోంది. గడిచిన వారం రోజుల్లోనే ప్రాజెక్టు నీటిమట్టం 5 అడుగులు పెరిగి ప్రస్తుతం 541 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి ప్రస్తుతం 56,315 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.
News February 21, 2026
నల్లగొండ: బతుకుతెరువుకు వంద మార్గాలు..!

పనిచేయాలనే తపన ఉండాలే కానీ.. బతుకుతెరువుకు వంద మార్గాలు ఉన్నాయని నల్లగొండ యువత నిరూపిస్తోంది. స్థానికంగా ఓ మార్ట్ వద్ద డెలివరీ బాయ్స్‌గా చేరేందుకు యువత క్యూ కడుతున్నారు. ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలే దీనికి ప్రధాన కారణం. డెలివరీ పాయింట్ దూరాన్ని బట్టి చెల్లింపులు ఉన్నాయి. 1.3 కిలోమీటర్ల లోపు ప్రతి డెలివరీకి రూ.35, ఆ పైన దూరం ఉంటే రూ.45 చొప్పున సంస్థ అందిస్తోంది.


