News August 31, 2025
NLG: గతేడాది కంటే తక్కువే..!

ఖరీఫ్ సీజన్ సాగు ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 10,73,162 ఎకరాల్లో పత్తి, వరి, ఇతర పంటలను రైతులు సాగు చేశారు. సింహభాగంలో పత్తి.. ఆ తర్వాత వరి సాగైంది. ఈసీజన్లో 11.60 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. గత వానాకాలం సీజన్లో 11.60,374 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను రైతులు సాగు చేశారు. గతేడాది కంటే ఈసారి తక్కువగానే రైతులు సాగు చేస్తున్నారు.
Similar News
News November 4, 2025
NLG: పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

వివిధ ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన భూసేకరణ పనులు, పునరావాస కాలనీల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె తన చాంబర్లో జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఎత్తిపోత పథకాల కింద భూసేకరణ, పునరావస పనులపై సమీక్ష నిర్వహించారు.
News November 4, 2025
నల్గొండ: ‘గృహజ్యోతి పథకానికి దరఖాస్తులు స్వీకరించాలి’

రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆహార భద్రత కార్డులను మంజూరు చేస్తున్న సందర్భంగా గృహజ్యోతి పథకానికి మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని నూతన లబ్ధిదారులు కోరుతున్నారు. రేషన్ కార్డ్ లేకపోవడం వల్లే గతంలో నిర్వహించిన ప్రజాపాలనలో తమ దరఖాస్తులు అధికారులు స్వీకరించలేదని వారు తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లాలో సుమారు 60 వేల మంది నూతన కార్డుదారులు ఉన్నారు.
News November 4, 2025
NLG: ఆందోళన బాటలో ప్రైవేట్ కాలేజీలు

జిల్లాలు ప్రైవేట్ కళాశాలలు ఆందోళన బాట పట్టాయి. ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల విడుదలలో జాబితాన్ని నిరసిస్తూ ఎంజీయూ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు కళాశాల నిరవధిక బంద్ పాటిస్తున్నాయి. సోమవారం నుంచి తరగతులతో పాటు కళాశాలల బంద్ చేపట్టాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా కళాశాలల ఎదుట బంద్ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.


