News December 13, 2025

NLG: గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

ఉమ్మడి NLG జిల్లాలో SC, ST, BC, జనరల్ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను విడుదలైంది.

✓​దరఖాస్తు స్వీకరణ: 11-12-2025 నుంచి 21-01-2026 వరకు.

✓​పరీక్ష తేదీ: 22-02-2026.

​దరఖాస్తు ఫీజు: రూ.100/-

✓ పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకోవడానికి https://tgcet.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

-SHARE IT

Similar News

News December 15, 2025

లోయలో పడిన స్కూల్ బస్సు.. 17 మంది మృతి

image

కొలంబియాలోని ఆంటియోక్వియాలో ఘోర ప్రమాదం జరిగింది. టూర్ నుంచి వస్తున్న స్కూల్ బస్సు లోయలో పడటంతో 17 మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది 16-18 ఏళ్లలోపు పిల్లలేనని అధికారులు తెలిపారు. మరో 20 మంది గాయపడ్డారని చెప్పారు. వారికి సమీప ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బీచ్‌లో గ్రాడ్యుయేషన్ వేడుకలు చేసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు గవర్నర్ ఆండ్రెస్ జూలియన్ వెల్లడించారు.

News December 15, 2025

కర్నూలు జిల్లాలో బదిలీ అయిన ఎస్ఐలు వీరే!

image

కర్నూలు రేంజ్‌లో 15 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. ఏపీ శ్రీనివాసులు కర్నూల్ 4 టౌన్ నుంచి 3 టౌన్‌కు, హనుమంత్ రెడ్డి గూడూరు పీఎస్ నుంచి సీసీఎస్ కర్నూల్‌కు, శరత్ కుమార్ నాగలాపురం నుంచి కర్నూలు 4 టౌన్‌కు, ఎల్.శివాంజల్ మంత్రాలయం నుంచి సీసీఎస్‌కు, ఈ.మూర్తి హల్లహర్వి నుంచి DSB కర్నూల్‌కు, విజయ్ కుమార్ నాయక్ మద్దికేర నుంచి పత్తికొండ యూపీఎస్‌కు బదిలీ అయ్యారు.

News December 15, 2025

సిద్దిపేట: మూడవ విడతలో 3841 మంది పోలింగ్ సిబ్బంది

image

సిద్దిపేట జిల్లాలో జరుగనున్న మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో 3841 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో మూడవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం నిర్వహించారు. మొత్తం 3841 మంది సిబ్బంది పనిచేయనున్నారని, ఇందులో 1718 పీఓలు, 2123 అదనపు పీఓలను నియమించినట్లు తెలిపారు.