News November 8, 2025

NLG: చర్చలు ఫలప్రదం.. బంద్ విరమణ

image

ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ప్రైవేట్ కళాశాలల బంద్‌కు తెరపడింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఈనెల 3 నుంచి నిరవధిక బంద్ చేపట్టిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం కళాశాలల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ నిర్ణయంతో శనివారం నుంచి కళాశాలలు యథావిధిగా తెరుచుకోనున్నాయి.

Similar News

News November 8, 2025

జూబ్లీహిల్స్‌: 3 రోజులు సెలవులు.. 2 రోజులు 144 సెక్షన్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పోలింగ్ రోజు 11న నియోజకవర్గంలోని Govt, Pvt ఆఫీసులు, స్కూళ్లకు సెలవు ఉంటుంది. 10న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసిన స్కూళ్లలకు సెలవు ప్రకటించారు. 14న కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో సెలవు ఉంటుందని కలెక్టర్ హరిచందన ప్రకటించారు. అలాగే 10న సా.6 గం. నుంచి 11న సా.6 వరకు, 14న ఉ.6 గం. నుంచి 15న ఉ.6 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ సజ్జనార్ తెలిపారు.

News November 8, 2025

వనపర్తి: నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఎస్పీ

image

వనపర్తి జిల్లాలో వాహనాల పరిమితికి మించి ప్రయాణించకూడదని ఎస్పీ రావుల గిరిధర్ వాహన చోదకులను హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రజలు సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోగలరని తెలిపారు. పరిమితికి మించి ప్రయాణించి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని సూచించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

News November 8, 2025

ఏలూరు: భక్త కనకదాసుకు నివాళులర్పించిన కలెక్టర్

image

భక్త కనకదాసు జీవితం మనందరికీ ఆదర్శనీయమని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. శనివారం ఏలూరు కలెక్టరేట్‌లో భక్త కనకదాసు జయంతి కార్యక్రమం జరిగింది. భక్త కనకదాసు చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భక్త కనకదాసు విశిష్టమైన కవిగా, తత్త్వవేత్తగా, గొప్ప సామజిక సంస్కర్తగా పేరుగాంచారని కొనియాడారు. ఆయన రచనలు, కీర్తనలు ప్రజలకు భక్తిని మానవత్వాన్ని  బోధించాయన్నారు.